Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ బృందం శక్తిమేరా కృషిచేస్తోంది: రాజమౌళి

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 AM GMT
ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ బృందం శక్తిమేరా కృషిచేస్తోంది: రాజమౌళి
X
దేశం మొత్తం కరోనా మహమ్మారితో వణుకుతోంది. ఎక్కడ చూసినా వేలసంఖ్యలో మరణాలు నమోదు అవుతున్న వార్తలు వింటుంటే జనాలు వణికిపోతున్నారు. అయితే ఇలాంటి కఠినమైన పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమవంతు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ లిస్టులో మొదటిగా ఆర్ఆర్ఆర్ ఫేమ్ దర్శకధీరుడు రాజమౌళి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ బృందం ప్రస్తుతం సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలలో సినిమా విశేషాలకు బదులుగా కరోనా బాధితులకు కావాల్సిన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళి వెల్లడించారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బృందం అంతా కరోనా బాధితులకు సహాయం అందించడానికి కృషి చేస్తోంది. ఎక్కడెక్కడ ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. ఆక్సిజన్ అవసరం.. కరోనా మందులు వంటి సమాచారం తమ ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసి తెలుసుకోవచ్చు అని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి డేంజర్ పరిస్థితిలో మా చిత్రబృందం తమ శక్తి మేర సహాయం అందిస్తోంది. ఎప్పటికప్పుడు సమాచారం కోసం మీరు @rrr ఖాతాను ఫాలో అవ్వచ్చని చెప్పుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బృందం చేస్తున్న సేవలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తో పాటుగా ఇలా చాలామంది స్టార్స్ కరోనాకు వ్యతిరేకంగా నెటిజన్లకు తగిన హెల్ప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినీతారలు కూడా కోవిడ్ వ్యతిరేక పోరాటంలో భాగమైనందుకు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.