Begin typing your search above and press return to search.
సైలెంటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' టీమ్...!
By: Tupaki Desk | 18 April 2020 10:50 AM GMTకరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఈ వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ లోకి వెళ్లింది. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు సినిమా నిర్మాణాలను - షూటింగులను ఎక్కడికక్కడ ఆపేసి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కొంతమంది ఈ లాక్ డౌన్ సమయాన్ని సైలెంటుగా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వాడుకోవాలని భావిస్తున్నారట. అందులో 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్ కూడా ఉంది. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడే తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నెక్స్ట్ షెడ్యూల్ కి టైం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చేశాడట.
ప్రపంచంలోని వివిధ ప్రముఖ స్టూడియోలకు ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అప్పగించారని సమాచారం. అందులో కొన్ని లాక్ డౌన్ వల్ల పనులు చేయడం లేదట. అయితే కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుంటాయి కదా. అలాంటి సంస్థల్లో 'ఆర్.ఆర్.ఆర్' వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయట. రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనకు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో అవన్నీ ఆన్ లైన్ ద్వారానే చెబుతున్నాడట. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని.. అనుకున్న సమయానికే సినిమాని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశాడట రాజమౌళి.
కాగా ఇప్పటికే చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ పర్ రామరాజు' పేరుతో విడుదల చేసిన రామ్ చరణ్ ఇంట్రో వీడియో భారీ ఆదరణ దక్కించుకుంది. చరణ్ పరిచయ వీడియోకి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ వీడియో 'రామరాజు ఫర్ భీమ్' ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన పనులూ జరుగుతున్నాయట. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న 'ఆర్.ఆర్.ఆర్' విడుదల కానుంది. రాజమౌళి బాహుబలి తర్వాత తీస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.