Begin typing your search above and press return to search.

జపాన్ లో రచ్చ చేయడానికి రెడీ అయిన RRR త్రయం..!

By:  Tupaki Desk   |   18 Oct 2022 4:30 PM GMT
జపాన్ లో రచ్చ చేయడానికి రెడీ అయిన RRR త్రయం..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం అక్టోబర్ 21న జపాన్‌ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే 'బాహుబలి' ప్రాంఛైజీతో జక్కన్న జపాన్ లో సత్తా చాటాడు. మరోవైపు తారక్ - చరణ్ లకు కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో RRR చిత్రంతో వీరు ముగ్గురు కలిసి సందడి చేయడానికి రెడీ అయ్యారు.

మూవీ ప్రమోషన్స్ లో మాస్టర్ మైండ్ అయిన ఎస్ఎస్ రాజమౌళి.. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని జపాన్ లో దూకుడుగా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేశారు. గత రాత్రి రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి టోక్యోకి బయలుదేరడం మనం చూశాం. ఈరోజు ఎన్టీఆర్ తన భార్య ప్రణతి మరియు ఇద్దరు పిల్లలు అభయ్ రామ్ - భార్గవ్ రామ్ లతో కలిసి వెళ్లిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో RRR త్రయం రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు జపాన్ ప్రమోషన్స్‌ లో హంగామా చేయనున్నారు. 'బాహుబలి' క్రేజ్‌ ని క్యాష్ చేసుకుని ట్రిపుల్ ఆర్ ను నెక్స్ట్ లెవల్‌ కి తీసుకెళ్లడానికి పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇప్పటికే జపనీస్ ఆర్టిస్టులు మరియు డ్యాన్సర్లు జపాన్‌ లో ప్రతిచోటా RRR సినిమాలోని సూపర్‌ హిట్ 'నాటు నాటు' సాంగ్ కు స్టెప్పులు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ట్రిపుల్ ఆర్ క్రేజ్ అక్కడ మాములుగా లేదనిపిస్తోంది. దీన్ని తదుపరి లెవల్ కి తీసుకెళ్లడానికి ఇప్పుడు తారక్ - చరణ్ కూడా వారితో జత కలవనున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ పరిశీలన కోసం పంపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జపాన్ రిలీజ్ అకాడమీ అవార్డుల కొరకు క్యాంపెయిన్ మాదిరిగా ఉపయోగపడుతుంది.

ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో 'నాటు నాటు' పాటను నామినేట్ చేయాలని ఎదురుచూస్తున్న తరుణంలో.. జపాన్ వేదికగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నాటు నాటు స్టెప్పులు వేస్తారేమో చూడాలి. ఏదేమైనా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు 1200 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టిన RRR.. జపాన్ రిలీజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో చేరే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 1920స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన RRR చిత్రంలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - శ్రియా శరన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.