Begin typing your search above and press return to search.

#RRR క్యూట్ జెన్నిఫ‌ర్ కి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన టీమ్

By:  Tupaki Desk   |   29 Jan 2021 11:42 AM IST
#RRR క్యూట్ జెన్నిఫ‌ర్ కి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన టీమ్
X
భార‌త‌దేశ స్వాతంత్య్ర పోరాటానికి మునుపు ఇద్ద‌రు తెలుగు వీరుల అల‌యెన్స్ కి సంబంధించిన‌ క‌థ‌ను ఫిక్ష‌న‌ల్ గా తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ అనేది టైటిల్. ఇందులో ఏపీకి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌.. నైజాంకి చెందిన గిరిజ‌న వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ‌ ఆలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. యంగ్ య‌మ ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ ఒలీవియా న‌టిస్తోంది. బ్రిటీష్ నటి ఒలీవియా స్టేజీ ఆర్టిస్టు అన్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో జెన్నిఫ‌ర్ అనే బ్రిటీష్ యువ‌తి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇంత‌కుముందే జెన్నిఫ‌ర్ లుక్ ని షేర్ చేయ‌గా అది తార‌క్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. 2020 న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆర్.ఆర్.ఆర్ అధికారిక ట్విట్ట‌ర్ కి ఒలీవియా రీట్వీట్ చేసింది. ``హ్యాపీ న్యూ ఇయ‌ర్.. ఆర్.ఆర్.ఆర్ త్వ‌ర‌లో రిలీజ‌వుతోంది. న‌మ్మ‌లేనంత ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నాను`` అని ఆనందం వ్య‌క్తం చేసింది. కానీ మ‌హ‌మ్మారీ వ‌ల్ల షూట్ ఆల‌స్యమ‌వ్వ‌డంతో రిలీజ్ తేదీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిన‌దే.

నిజానికి ఆర్.ఆర్.ఆర్ లో అవ‌కాశం రావ‌డంతో స్టేజీ డ్రామా న‌టి ఒలీవియా సీన్ ఒక్క‌సారిగా మారిపోయింది. అంత‌కుముందు త‌ను ఎవ‌రో ఎవ‌రికీ తెలీదు. కానీ ఇప్పుడు కోటానుకోట్ల మంది తార‌క్ అభిమానుల‌కు ప‌రిచ‌యం అయిపోయింది. సామాజిక మాధ్య‌మాల్లో ఒలీవియాకు భారీ ఫాలోయింగ్ ఉందిప్పుడు.

లేటెస్టుగా ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్న జెన్నిఫ‌ర్ పాత్ర‌ధారి ఒలీవియా లుక్ ని రాజ‌మౌళి అండ్ టీమ్ స్వ‌యంగా రిలీజ్ చేశారు. ఒలీవియాకి హ్యాపీ బ‌ర్త్ డే అంటూ విషెస్ ని చిత్ర‌బృందం తెలిపింది. తాజా పోస్ట‌ర్ లో ఒలీవియా క్లాసిక్ డేస్ అవ‌తారం ఆక‌ట్టుకుంది. అలానే త‌న‌ క్యూట్ చ‌బ్బీ లుక్ మ‌నోహ‌ర‌మైన రూపం ఆక‌ర్షిస్తోంది. ఈ పోస్ట‌ర్ లో మ‌రోసారి రిలీజ్ తేదీని వెల్లడించారు. ద‌స‌రా కానుక‌గా 13 అక్టోబ‌ర్ 2021న ఈ మూవీ రిలీజ‌వుతోంది. ప్ర‌స్తుతం తారక్ ఫ్యాన్స్ లో ఒలీవియా లుక్ వైర‌ల్ గా మారింది.