Begin typing your search above and press return to search.
RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!
By: Tupaki Desk | 29 March 2020 2:30 AM GMTఒక సినిమాను నిర్మించడం వేరు.. దానికి సరైన ప్రచారం కల్పించి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం వేరు. చాలామంది ఈ ప్రచారం విషయంలో వెనకబడతారు. ఓపెనింగ్స్ లేక సినిమా హిట్ అయ్యే అవకాశాలు జారవిడుచుకుంటారు. అయితే రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ మాత్రం ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతూ ఉంటాయి. నిజానికి రాజమౌళి మార్కెటింగ్ వల్లే తన సినిమాల క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. 'బాహుబలి' సమయంలో రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ చాలామందిని అబ్బురపరిచాయి. ఇప్పుడు 'RRR' విషయంలో లో కూడా అలాంటి ఎత్తుగడతోనే ముందుకు వెళ్తున్నారు.
కరోనా దెబ్బకు షూటింగులు ఆగిపోయాయి. ప్రమోషన్లు కూడా ఆపారు. లాక్ డౌన్ కావడంతో దాదాపుగా ప్రజలంతా ఇంటిపట్టునే ఉంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేందుకు రాజమౌళి టీమ్ రెడీ అయింది. మొదట మోషన్ పోస్టర్ తో వచ్చారు. టైటిల్.. మోషన్ పోస్టర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదల చేశారు. ఇది కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ కు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్టుకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ అయినా కొంత మేర పెయిడ్ ప్రమోషన్స్ చెయ్యాలి. టీజర్లు కానివ్వండి.. ట్రైలర్లు కానివ్వండి డిజిటల్ ప్రమోషన్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అయితే ఇప్పుడు 'RRR' టీమ్ కు ఒక్క పైసా ఖర్చు లేకుండా పని జరుగుతోంది. జనాలు అందరూ ఇంటిపట్టున ఉండడం.. కరోనా టాపిక్ తప్ప మరో అంశం లేకపోవడంతో వారు కూడా కొత్త టాపిక్ కోసం రెడీగా ఉన్నారు. ఈ సమయంలో 'RRR' నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. జనాలు ఇంట్లో ఫ్రీగా ఉండడంతో ఈ వ్యూస్ నంబర్ మరింతగా పెరుగుతోంది.
మొత్తానికి ఈ లాక్ డౌన్ కరోనా ప్రచారానికి పెద్ద వరంగా మారింది. ఈ సమయంలో ప్రచారం గురించి ఆలోచన చేయని ఇతర ఫిలిం మేకర్లను ఒక్కసారిగా మేల్కొలిపింది. RRR టీం బాటలో మరి కొంతమంది ప్రచార కార్యక్రామాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారట.