Begin typing your search above and press return to search.

RRR థ‌ర్డ్ సింగిల్ డేట్ లాక్డ్

By:  Tupaki Desk   |   19 Nov 2021 9:56 AM GMT
RRR థ‌ర్డ్ సింగిల్ డేట్ లాక్డ్
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కథానాయ‌కులుగా న‌టిస్తోన్న RRR రిలీజ్ జోష్ అప్పుడే మొద‌లైపోయింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేస్తుండ‌టంతో ప్ర‌చారం ప‌నులు స్పీడ‌ప్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు పాట‌ల్ని రిలీజ్ చేసి సినిమాపై అమాతం అంచ‌నాల్ని పెంచేసారు.

ఇటీవ‌లే విడుద‌లైన రెండ‌వ పాట సినిమాపై అంచ‌నాల్ని అంత‌కంత‌కు రెట్టింపు చేసింది. చ‌ర‌ణ్..తార‌క్ స్టెప్పుల్లో పోటీ ప‌డ‌టం ఇద్ద‌రి హీరోల అభిమానుల్ని మ‌రింత ఉత్సాహాన్ని నింపింది. చ‌రిత్ర నేప‌థ్యంలో సాగే చిత్రంలో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సాంగ్ సినిమాపై అంచ‌నాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది.

తాజాగా మూడ‌వ‌ పాట రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈనెల 24న మ‌రో కొత్త పాట‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తోందిట‌. ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ఆ డేట్ స‌హా టైమ్ కూడా వెల్లడించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ పాట విడుద‌లైన రెండు పాటల్ని మించి ఉంటుంద‌ని..కీర‌వాణి మార్క్ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా ప్రోగ్ర‌స్ విష‌యానికి వ‌స్తే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దాదాపు ఆ ప‌నులు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ కొంత పార్టు డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసారు. చ‌ర‌ణ్..ఎన్టీఆర్ ఇత‌ర సినిమా ప‌నుల్లోనూ బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 15వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ నుంచి చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ భార‌తీయుడు -2 కార‌ణంగా డిలే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వీలైనంత షూట్ పూర్తిచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక తార‌క్ -కొర‌టాల శివ‌తో కొత్త సినిమా లాంచ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.