Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో `ఆర్ ఆర్ ఆర్` `R`కే ప‌రిమిత‌మా?

By:  Tupaki Desk   |   20 March 2022 10:30 AM GMT
హైద‌రాబాద్ లో  `ఆర్ ఆర్ ఆర్`  `R`కే ప‌రిమిత‌మా?
X
పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` టిక్కెట్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ర్టాల్లో టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకోమ‌ని ఆదేశాలివ్వ‌డంతో మేక‌ర్స్ హ్యాపీ. దీంతో బెనిఫిట్ షోల‌కు రంగం సిద్ద మ‌వుతోంది. మార్చి 24 రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడుతున్నాయి. ఒక్కో టిక్కెట్ ధ‌ర 3000 రూపాయ‌ల నుంచి 5000 ల వ‌ర‌కూ ప‌లుకుతుంద‌ని స‌మాచారం. బెనిఫిట్ షోలు అనేవి కేవ‌లం ఫ్యాన్స్ హ‌డావుడి నేప‌థ్యంలో సాగేవి కాబ‌ట్టి ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌పై అభిమానులు కురిపించే ప్రేమ అది.

అయిన‌ప్ప‌టికీ టిక్కెట్ ధ‌ర మ‌రీ ఎక్కువ‌గా ఉందంటూ ఓ వైపు అస‌హ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి. అభిమానం పేరుతో ఓ రేంజ్ లో బాధేస్తున్నారంటూ హీరోల యాంటి గ్యాంగ్ అభిప్రాయ‌ప‌డుతుంది. తాజాగా హైద‌రాబాద్ లో మ‌రో ర‌క‌మైన టిక్కెట్ ధ‌ర చూస్తే ఖంగు తినాల్సిందే. హైద‌రాబాద్ సిటీలో `ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ టిక్కెట్ ధ‌ర 419 రూపాయ‌లుగా నిర్ధారించిన‌ట్లు స‌మాచారం. ఈ ధ‌ర కేవ‌లం హైద‌రాబాద్ ప‌రిధిలో మాత్ర‌మే అమలులో ఉంటుంది.

మ‌రి ఎన్ని రోజులు అన్న‌ది తెలియుద‌గానీ..బాదుడు మాత్రం ఓ రేంజ్ లో ఉంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ ధ‌ర‌కు `ఆర్ ఆర్ ఆర్` సినిమా వీక్షిండ‌చం అన్న‌ది కేవ‌లం ఓ వ‌ర్గం ఆడియ‌న్స కి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ `ఆర్ ఆర్ ఆర్` మేక‌ర్స్ కేవ‌ల ``ఆర్`` అనే అక్ష‌రం సంకేతంగా ఉన్న వాళ్లకే అందిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ ధ‌ర‌తో సామాన్య సినీ ప్రేక్ష‌కుడు `ఆర్ ఆర్ ఆర్` సినిమా వీక్షించ‌డం అన్న‌ది చాలా క‌ష్ట‌మైన ప‌ని.

ఫ్యామిలీ ఆడియ‌న్స్ సినిమా కి వెళ్లాలంటే క‌నీసం ఆలోచ‌న‌కి కూడా రాకుండా చేసే ధ‌ర‌గా క‌నిపిస్తుంది. వినోదం అనేది అంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని ఓవైపు క‌బుర్లు చెబుతూనే మ‌రోవైపు అధికంగా ధ‌ర‌లు పెంచేసి ఓ వ‌ర్గాన్నే టార్గెట్ చేయ‌డం అన్న‌ది ఓ దోపిడీగా క‌నిపిస్తుందంటూ నెటి జ‌నులు మండిప‌డుతున్నారు. ఇటీవ‌లే ఓ ఈవెంట్ లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలంగాణ‌లో పెరిగిన టిక్కెట్ ధ‌ర్ పై పూర్తి సంపూర్ణ ఆనందాన్ని వ్య‌క్తి చేసారు.

కానీ ఏపీ విష‌యంలో కాస్త అసంతృప్తి క‌నిపించింది. ఏపీలో పెరిగాయి..కానీ మ‌రీ అంత కాదు..అంద‌రికీ అందుబాటులో ఉండేలా అంటూ జ‌క్క‌న వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దాన్ని బ‌ట్టి హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో టిక్కెట్ ధ‌ర ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధ‌మ‌వుతోందిగా.

అయితే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునేలా రెండు రాష్ర్టాల ప్ర‌భుత్వాలు సానుకూలంగా ఉండ‌టంతోనే ఇది సాధ్య‌మైంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాకి 400 కోట్లు ఖర్చు చేసారు. `బాహుబ‌లి` వ‌సూళ్ల టార్గెట్ గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. మ‌రి పెరిగిన టిక్కెట్ ధ‌ర‌ల నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్` ఓపెనింగ్స్ లో రూపంలో ఎన్ని కోట్లు రాబ‌డుతుందో చూడాలి.