Begin typing your search above and press return to search.
#RRR: పోస్టర్ అలా ఉంటుందట
By: Tupaki Desk | 18 Nov 2018 1:04 PM GMTరాజమౌళి సినిమా అంటే అంతే. సినిమా మొదలు పెట్టకముందునుంచే స్పెక్యులేషన్స్ జోరుగా హల్చల్ చేస్తాయి. ఇక అవి రిలీజ్ వరకూ ఆగవు. ఇప్పటికే రాజమౌళి తాజా చిత్రం #RRR కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కథ గురించి.. చరణ్ - ఎన్టీఆర్ పాత్రల గురించి.. టైటిల్ గురించి ఇలా అన్నీ వార్తలే. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి ప్రారంభం అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే #RRR ఫస్ట్ పోస్టర్ గురించి ఆసక్తికరమైన ఒక అప్డేట్ ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది.
మొదటి షెడ్యూల్ రెండువారాల పాటు జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మొదటి రెండు రోజులు టీజర్ పోస్టర్ కి సంబంధించిన షూటింగ్ సాగుతుందట. ఇందులో ఎన్టీఆర్ భారీకాయం.. చరణ్ కొత్త హెయిర్ స్టైల్ అందరినీ థ్రిల్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ పోస్టర్ జనవరి లోపే విడుదల చేస్తారని.. ఈ పోస్టర్ తో సినిమాలో మెగా నందమూరి హీరోలు ఎలాంటి పాత్రలు పోషించనున్నారనేది ప్రేక్షకులకు అర్థం అవుతుంది.
ఇదిలా ఉంటే టైటిల్ ను కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా 'వర్కింగ్ టైటిల్' లాగా ముందే రివీల్ చేస్తారని.. ఒకవేళ ఆ టైటిల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన పక్షంలో దాన్నే ఫైనలైజ్ చేస్తారట. రాజమౌళి గతంలో తన సినిమాల విషయంలో ఇలాంటి పద్దతే ఫాలో అయ్యేవాడు. మరి ఆ పోస్టర్ ఎలా ఉంటుందో.. టైటిల్ ఎలా ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.