Begin typing your search above and press return to search.
#RRR టైటిల్ లాంచ్.. కొన్ని గంటల్లోనే..!
By: Tupaki Desk | 24 March 2020 2:30 PM GMTప్రపంచం మొత్తం కరోనా గురించి ముచ్చటించుకుంటున్న ఈ సమయంలో #RRR టీమ్ నుంచి జనం ఏదైనా ఆశిస్తున్నారా? ఓవైపు జనం కరోనా వైరస్ టెన్షన్ లో ఉంటే వీళ్లను పట్టించుకునేది ఎవరు అంటారా? అసలు ఇది రాంగ్ టైమింగా? రైట్ టైమింగా? అన్నది అటుంచితే కరోనాని మించిన స్పీడ్ తో టైటిల్ రిలీజైపోతోంది మరి. కరోనా ఫీవర్ ని ఆర్.ఆర్.ఆర్ టైటిల్ అధిగమించగలుగుతుందో లేదో కానీ.. ఈ బుధవారం ఆర్.ఆర్.ఆర్ టైటిల్ సస్పెన్స్ అయితే వీడిపోనుంది. ఇన్నాళ్లు ఎపుడెపుడా? అని వెయిటింగ్ లో ఉన్న తారక్ .. చరణ్ అభిమానులకు టైటిల్ పరంగా అన్నిటినీ క్లియర్ చేసేసే టైమ్ వచ్చేసింది.
ఈ బుధవారం (మార్చి 25) నాడు మొత్తం ఐదు భాషల్ల #RRR టైటిల్ లోగోని .. మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసేందుకు టీమ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటించేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా అందుకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ``ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. రేపు ఉదయం ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ని లాంచ్ చేస్తున్నాం. మీలోని దైవశక్తిని మేల్కొలిపే సందర్భమిదే`` అని తారక్ తెలిపారు. తెలుగు- తమిళం- హిందీ- మలయాళం- కన్నడంలో టైటిల్ లోగోని లాంచ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. మొత్తానికి టైటిల్ ప్రకటనతో డీవీవీ సంస్థ ఒక చిన్న బరువును దించేసుకుంటోంది. ఇన్నాళ్ల సస్పెన్స్ కి తెరపడిపోతోంది కాబట్టి మెగా నందమూరి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కి టెన్షన్ తీరిపోనుంది. మరోవైపు జక్కన్న ఎలాంటి టైటిల్ పెడతాడా? అంటూ ఆసక్తిగా వేచి చూస్తున్న జాతీయ మీడియాకి హిందీ పరిశ్రమ వర్గాలకు కూడా అన్ని టెన్షన్లు వదిలిపోయే సమయం వచ్చేసిందన్నమాట.
ఓవైపు గూగుల్ ట్రెండింగ్ లో కరోనా అన్న హ్యాష్ ట్యాగ్ తప్ప ఇంకేదీ కనిపించడం లేదు. ఇలాంటప్పుడు #RRR దానిని మించి వైరల్ అవుతుందా? అన్నది కాస్త ఆగి చూడాలి. ఇక ఈ సినిమా షెడ్యూల్ కరోనా సెలవుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 వస్తే కానీ ఏదీ క్లారిటీ రాదు. ఆ తర్వాతా వైరస్ ప్రభావం జీరో అయితేనే షూటింగులు చేసే వీలుంటుందేమో!