Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ ట్రైలర్... జూనియర్ ఫ్యాన్స్ షాక్... ?

By:  Tupaki Desk   |   10 Dec 2021 2:30 PM GMT
ట్రిపుల్ ఆర్ ట్రైలర్... జూనియర్ ఫ్యాన్స్ షాక్... ?
X
ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ఇపుడు అదరగొట్టేస్తోంది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చగా ఉంది. ఈ మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. గట్టిగా నెల కూడా లేదు. ట్రిపుల్ ఆర్ హంగామా అయితే సూపర్ లెవెల్ లో మొదలైపోయింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా ఏంటో చూచాయగా చెప్పేసింది. టాప్ అనిపించే సీన్స్ అందంగా కట్ చేసి మరీ ప్రెజెంట్ చేశారు. దీంతో ఈ మూవీ మీద అంచనాలు కోటింత‌లు పెరిగాయి.

ఈ ట్రైలర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ గా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ హుషార్ ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ ఫెరోషియస్ గా కనిపిస్తాడని ట్రైలర్ కధ చెబుతోంది. అదే టైమ్ తో నక్కల వేట కాదు, కుంభస్థలాన్ని కొట్టడమే అంటూ అదిరిపోయే డైలాగ్ తో రామ్ చరణ్ చేసే సౌండ్ కూడా ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడిచేలా ఉందంటున్నారు.

అదే సమయంలో ఎన్టీయార్ కి ఎలాంటి డైలాగ్స్ లేవు, పైగా ఆయన గోండు తెగ నాయకుడిగా కనిపిస్తాడని ట్రైలర్ చెబుతోంది. ఎమోషన్స్ ని పండించే సీన్స్ ఆయన‌కు ఉంటాయని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది. సరే ట్రైలర్ ని చూస్తే కొన్ని విషయాలు అర్ధమవుతున్నాయి. అల్లూరి గా స్కోప్ ఉండే రోల్ తో పాటు పోలీస్ అంటేనే భీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే పాత్రలో రామ్ చరణ్ ఉంటాడని తెలుస్తోంది.

మరి గోండు వీరుడు గా ఎన్టీయార్ ఎలా అదరగొడతాడు అన్నది సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే సింహానికి ఎదురుగా నిలిచి ఎన్టీయార్ గాండ్రించే సీన్ ట్రైలర్ లో హైలెట్ అంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇక్కడే ఎన్టీయార్ స్క్రీన్ ప్రెజెన్స్ మీదనే వారికి కొత్త డౌట్లు పుడుతున్నాయట. తమ హీరోకు సమాన‌మైన రోల్ ఇచ్చి న్యాయం చేస్తారా అన్న డౌట్ అయితే వారిలో ఉందిట.

కానీ అక్కడ ఉన్నది దర్శక ధీరుడు రాజమౌళి. ఇద్దరు టాప్ హీరోలని తీసుకున్నపుడు వారికి ఉన్న అశేషమైన ఫ్యాన్స్, వారిద్దరి ఇమేజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే స్క్రీన్ మీద కధ అల్లుకుంటారని అంటున్నారు. సో రాజమౌళి కచ్చితంగా ఇద్దరికీ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తారని సినీ పండిట్స్ మాట. అయితే ఎన్టీయార్ నుంచి ఎమోషన్స్ ఎక్కువగా పండించేందుకు డైరెక్టర్ ట్రై చేస్తే చేయవచ్చు అన్న టాక్ కూడా ఉంది. మొత్తానికి ఈ మూవీ ఒక హిస్టరీని క్రియేట్ చేయడం ఖాయం. అందువల్ల ఎక్కువ తక్కువలు చూసుకోకుండా సినిమాను సినిమాగానే చూస్తే బెటర్ అన్న వారే ఉన్నారు.