Begin typing your search above and press return to search.

RRR ట్రైల‌ర్ లాంచ్.. థియేట‌ర్ వోన‌ర్స్ కి టెన్ష‌న్!

By:  Tupaki Desk   |   8 Dec 2021 9:57 AM GMT
RRR ట్రైల‌ర్ లాంచ్.. థియేట‌ర్ వోన‌ర్స్ కి టెన్ష‌న్!
X
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం RRR ట్రైల‌ర్ కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఇంకా మ‌రికొన్ని గంట‌ల్లోనే ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌న్న ఉత్కంఠ చ‌ర‌ణ్‌.. తార‌క్ అభిమానుల్లో మొద‌లైంది. ఒక‌టే ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ తో హ‌డావుడి గ‌ట్టిగానే ఉంటుంది. రిలీజ్ కు ముందు ట‌పాసులు..బాంబుల‌తో ఇద్ద‌రి హీరోల అభిమానులు హంగామా చేయ‌నున్నారు. పైగా స్టార్ హీరోలిద్ద‌రికి తొలి పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో అంత‌కంత‌కు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ యాజ‌మాన్యాలు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నార‌ని తాజా ఓన‌ర్ లేఖ చెబుతోంది. గురువారం ట్రైల‌ర్ రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో వైజాగ్ థియేట‌ర్ యాజ‌మాన్యాలు పోలీసుల్ని ఆశ్ర‌యించారు. ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు..లైవ్ స‌మ‌యంలో త‌మ థియేట‌ర్ల‌కు భారీ బందోబ‌స్త్ క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. వైజాగ్ కి చెందిన ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్స్ సంగం..శ‌ర‌త్ యాజ‌మాన్యం పోలీసుల్ని ఆశ్ర‌యించింది. గురువారం ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ ట్విన్ థియేట‌ర్స్ కి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఏసీపీకి విన‌తి ప‌త్రం అంద‌జేసారు. ఇప్పుడు వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

థియేట‌ర్ యాజ‌మాన్యం కంగారు ప‌డ‌టంలో త‌ప్పు లేదు. గ‌తంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్ `ట్రైల‌ర్ థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు వేసిన‌ప్పుడు భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. థియేట‌ర్లోకి సామర్ధ్యం మేర‌కు లోప‌లికి అనుమ‌తించారు. మిగిలిన వారు బ‌య‌టే ఉండిపోయారు. దీంతో అస‌హ‌నంతో థియేట‌ర్ పైకి రాళ్లు..క‌ర్ర‌లు రువ్వారు. `ఆర్.ఆర్.ఆర్` విష‌యంలోనూ అదే స‌న్నివేశం రిపీట్ అవుతుందేమోన‌న్న సందేహంతోనే ముంద‌స్తుగా పోలీసుల బందోబ‌స్త్ అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి చ‌ర‌ణ్ .. తార‌క్ అభిమానులు మూకుమ్మ‌డిగా థియేట‌ర్ల‌పై ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌న్న టాక్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ లో ద‌మ్మెంతో ఇప్ప‌టికే టీజ‌ర్లు చెప్పాయి. కానీ ట్రైల‌ర్ తో అన్నివిధాలా క్లారిటీ రానుంది. ఇది బిజినెస్ వ‌ర్గాల‌కు పెద్ద భ‌రోసాగా నిల‌వాల్సి ఉంటుంది. 1000 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంతో బ‌రిలో దిగుతున్న ఆర్.ఆర్.ఆర్ లో దమ్మెంతో ట్రైల‌ర్ లోనే అర్థ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు.