Begin typing your search above and press return to search.
RRR కి రెండు తేదీలు.. ఇదేం ట్విస్టు?
By: Tupaki Desk | 4 Dec 2021 7:34 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజవుతోంది. ఈపాటికే ట్రైలర్ విడుదల కావాల్సి ఉన్నా ఆలస్యమైంది.
ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించిన నేపథ్యంలో డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ఈ చిత్రం ట్రైలర్ ను వాయిదా వేసినట్లు RRR టీమ్ ప్రకటించింది.
తాజా సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ డిసెంబర్ 7 లేదా 9న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తయింది. ఔట్ పుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తితో ఉన్నాడు. ఈ ట్రైలర్ లో అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ ల వీరరసాన్ని ఒక రేంజులో ఎలివేట్ చేశారని గుసగుస వినిపిస్తోంది. మూవీకి సంబంధించిన కొన్ని హైలైట్ సన్నివేశాల గ్లింప్స్ ని కూడా ఇందులో యాడప్ చేశారు.
ఈ చిత్రం జనవరి 7 న పెద్ద తెరపైకి రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి. యూనిట్ త్వరలో ప్రచారం పరంగా వేగం పెంచనుంది.
తెలుగు-తమిళం-హిందీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ కానుండగా.. పలు ఇతర భాషల్లోకి అనువాదమై విడుదల కానుంది. చరణ్ .. తారక్ లకు జపాన్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల ఆర్.ఆర్.ఆర్ ని అక్కడ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. బాహుబలి దర్శకుడిగా జపనీలకు రాజమౌళి ఎంతో సుపరిచితుడు కావడం ఆర్.ఆర్.ఆర్ కి పెద్ద ప్లస్ కానుంది.