Begin typing your search above and press return to search.

#RRR ఉక్రెయిన్ ప్ర‌తినిధుల‌తో తార‌క్ దోస్

By:  Tupaki Desk   |   11 Aug 2021 6:45 AM GMT
#RRR ఉక్రెయిన్ ప్ర‌తినిధుల‌తో తార‌క్ దోస్
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్ (ర‌ష్యా) ప‌రిస‌రాల్లో పాట‌లు స‌మా కీల‌క షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ .. రామ్ చ‌ర‌ణ్ స‌హా ఇత‌ర కీల‌క తారాగణం పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లో ఆన్ లొకేష‌న్ నుంచి ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. తార‌క్ .. రాజ‌మౌళి ఐడీ కార్డులు ధ‌రించి స్ట్రిక్టుగా కోవిడ్ ప్రోటోకాల్ న‌డుమ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. అక్క‌డ తీరిక స‌మ‌యాల్లో ఆట‌పాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.

తాజాగా ఉక్రెయిన్ నుంచి మ‌రిన్ని కొత్త ఫోటోల‌ను రివీల్ చేయ‌గా వీటిలో తార‌క్ ఆ దేశ ప్ర‌తినిధుల‌తో క‌నిపించారు. ఇంత‌కుముందు విదేశీ షూటింగుల్లో మ‌న స్టార్ల‌తో ఆయా దేశాల ప్ర‌తినిధులు ఫోటోలు దిగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఉక్రెయిన్ దేశానికి బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విజిట్ వ‌ల్ల ఆ మేర‌కు వినోద టూరిజానికి ప‌బ్లిసిటీ ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిరున‌వ్వులు చిందిస్తూ ఇలా ఉక్రెయిన్ ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన `దోస్తీ` సాంగ్ తో #RRR ప్ర‌మోష‌న్స్ మ‌రో స్థాయికి చేరుకున్నాయి. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా జ‌క్క‌న్న త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇక ప్ర‌మోష‌న్స్ ప‌రంగా పెద్ద స్థాయిలో ప్లానింగ్ చేశారు. భీమ్ ప్ర‌చారం పేరుతో ఆర్.ఆర్.ఆర్ ఇన్ స్టాలో స్పెష‌ల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. #RRR మూవీ ఇన్ స్టాగ్ర‌మ్ ని మ‌న భీమ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి టేకోవ‌ర్ చేస్తున్నాం. కొద్దిరోజుల పాటు అభిమానుల‌కు తార‌క్ ట‌చ్ లో ఉంటారు అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి తార‌క్ వ‌రుస‌గా ఇలాంటి ఆస‌క్తిక‌ర ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.

RRR టైటిల్ ని ముద్రించిన వైట్ టీష‌ర్ట్ ధ‌రించి తార‌క్ ఇంత‌కుముందు క‌నిపించారు. RRR టీమ్ ప్ర‌స్తుతం ఉక్రెయిన్ లో ఉంది. ర‌ష్యా- ఉక్రెయిన్- రొమానియా- బ్లాక్ సీ ఏరియాల్లో రామ్ చ‌ర‌ణ్- అలియా భ‌ట్ పై ఓ పాట చిత్రీక‌రించారు. అలాగే హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ పూర్త‌యితే త‌దుప‌రి పూర్తి స్థాయి నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. డెడ్ లైన్ ప్ర‌కారం సినిమాని రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా జ‌క్క‌న్న ప్ర‌తిదీ ప్లాన్ చేసారు.

ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. తార‌క్ కొమ‌రం భీమ్ గా క‌నిపించ‌నున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియా.. తార‌క్ స‌ర‌స‌న ఒలీవియా ఇందులో న‌టిస్తున్నారు. ఒలీవియా బ్రిటీష్ యువ‌రాణిగా క‌నిపిస్తుండ‌గా.. అల్లూరి భార్య మ‌న్యం దొర‌సాని సీత‌గా ఆలియాభ‌ట్ క‌నిపించ‌నుంది. ఈ జంట‌ల‌పై రొమాన్స్ ని రాజ‌మౌళి మ‌రో రేంజులో ఎలివేట్ చేస్తున్నార‌ని తెలిసింది. అజ‌య్ దేవ‌గ‌న్ త‌దిత‌రుల పైనా స‌న్నివేశాలు హైలైట్ గా ఉండ‌నున్నాయి. అలాగే ఈ చిత్రంలో ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు ఒక‌సారి గూస్ బంప్స్ తెచ్చే యాక్ష‌న్ విన్యాసాలు ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.