Begin typing your search above and press return to search.

RRR అప్డేట్‌ : ఇద్దరు హీరోలు చివరి పని కూడా ముగించారు

By:  Tupaki Desk   |   3 Oct 2021 11:04 AM GMT
RRR అప్డేట్‌ : ఇద్దరు హీరోలు చివరి పని కూడా ముగించారు
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్‌ ఆర్‌ సంక్రాంతికి విడుదల అవ్వడం కన్ఫర్మ్‌ అయ్యింది. విడుదల తేదీ విషయంలో గత కొన్ని నెలలుగా నెలకొని ఉన్న సస్పెన్స్ కు తెర పడ్డట్లయ్యింది. పెద్ద ఎత్తున ఈ సినిమాను దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 7వ తారీకున రాబోతున్న ఈ సినిమా సంక్రాంతిని వారం రోజుల ముందుగానే తీసుకు రాబోతుంది. దేశ వ్యాప్తంగా మంచి సమయం చూసి ఈ సినిమాను విడుదల చేయాలని ఇన్ని రోజులు భావించారు. ఇప్పుడు అన్ని భాషల్లో ఆ తేదీన పెద్ద సినిమాల విడుదల విషయంలో స్పష్టత రావడంతో విడుదలకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది. రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాహుబలి సినిమాను మించి వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి రికార్డులు బ్రేక్‌ చేయడం ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాలేదు. మళ్లీ రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లతో జక్కన్న తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టేందుకు సిద్దం అయ్యాడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇందుకోసం రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లను రాజమౌళి ఏ స్థాయిలో కష్టపెట్టాడు అనేది ఇటీవల ఒక కార్యక్రమంలో వారిద్దరు స్వయంగా చెప్పారు. కష్టపడ్డాం.. అందుకు తగ్గ ప్రతిఫలం అందబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రతి సినిమా ది బెస్ట్‌ గా ఉండేందుకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ నుండి మొదలుకుని డబ్బింగ్‌ వీఎఫ్‌ఎక్స్ వరకు అన్ని విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఇటీవల ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు కూడా డబ్బింగ్‌ చెప్పడం పూర్తి చేశారు.

సాదారణంగా అయితే ఒక్క రోజులోనే సినిమా మొత్తంకు హీరోలు డబ్బింగ్‌ చేయడం జరుగుతుంది. కాని డబ్బింగ్‌ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పడుతూ ఇద్దరు హీరోలతో సినిమా డబ్బింగ్‌ ను స్వయంగా రాజమౌళి పక్కన ఉండి చెప్పించాడని తెలుస్తోంది. ఇద్దరు హీరోల డబ్బింగ్‌ పూర్తి చేయడం తో పాటు ఇతర నటీ నటుల డబ్బింగ్‌ కార్యక్రమాలను కూడా ముగించేశారు. ఇక ప్రస్తుతం చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ కాపీని నవంబర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను డిసెంబర్ నుండి మొదలు పెట్టాలని నెల రోజుల పాటు అత్యంత ప్రముఖంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను చేయడం ద్వారా ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రచారం చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.