Begin typing your search above and press return to search.
ఆ మూడు రోజులు యూఎస్ లో ఎక్కడ చూసినా 'ఆర్‌ఆర్‌ఆర్'
By: Tupaki Desk | 21 Nov 2021 6:00 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ విడుదల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 7న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడం ఖాయం అంటూ ఇప్పటికే ప్రకటించారు. మళ్లీ తేదీ మార్చేది లేదు అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కోసం థియేటర్లను... స్క్రీన్స్ ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ఈ సినిమా ను ఎంత భారీగా తెరకెక్కించాడో అంతకు పది రెట్లు భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా ను మరో రేంజ్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా యూఎస్ ప్లాన్స్ ను యూనిట్ సభ్యులు అనధికారికంగా రివీల్ చేశారు. అక్కడ హాలీవుడ్ సినిమాలను మించి స్క్రీనింగ్ చేయబోతున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను అమెరికాలో అతి పెద్ద థియేటర్ చైన్ అయిన సినిమార్క్ తో ఒప్పందం చేసుకుందట. యూఎస్ లో సినిమార్క్ కు దాదాపుగా 350 మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి.
మొత్తంగా 288 సినిమార్క్ మల్టీ ప్లెక్స్ ల్లో వెయ్యికి పైగా స్క్రీన్స్ ల్లో మొదటి మూడు రోజులు ఆర్ ఆర్ ఆర్ స్క్రీనింగ్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే ఆ మూడు రోజులు కూడా అమెరికాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా నే కనిపించబోతుంది. కేవలం సినిమార్క్ థియేటర్ చైన్ లోనే కాకుండా ఇతర మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఈ సినిమా ను స్క్రీనింగ్ చేస్తారట.
విడుదల సమయంకు అమెరికాలో మొత్తం ఎన్ని స్క్రీన్స్ లో సినిమా స్క్రీనింగ్ అవ్వబోతుంది అనేది తెలియబోతుంది. ఇది ఖచ్చితంగా రికార్డు నెంబర్ అయ్యి ఉంటుందని అంటున్నారు. యూఎస్ లో అయిదు భాషలకు సంబంధించిన షో లు ఉంటాయట.
అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున షో లు వేయబోతున్నారు. తద్వారా యూఎస్ లో హాలీవుడ్ సినిమాలను మించిన వసూళ్లను ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంటుందని అంటున్నారు. ఈ సినిమా తో ఇండియన్ సినిమా స్థాయి హాలీవుడ్ లో దద్దరిల్లేలా పెరుగుతుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తుననారు.