Begin typing your search above and press return to search.
RRR వర్సెస్ AP.. దానయ్య పై బయ్యర్ల ఒత్తిడి?
By: Tupaki Desk | 30 Dec 2021 5:22 AM GMTRRR వర్సెస్ AP .. ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిక్ ఇది. ముఖ్యంగా బయ్యర్లు పంపిణీ వర్గాల్లో ఏపీలో మూవీ టికెట్ రేటు చర్చ అంతకంతకు వేడెక్కిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కఠిన ఆంక్షల నేపథ్యంలో అంతా హైటెన్షన్ అలుముకుంది. నిజానికి నైజాం వరకూ భారీ బిజెనెస్ సాగించినా పంపిణీ వర్గాల్లో కొంతవరకూ ధీమా ఉంది. కానీ ఏపీలో వసూళ్లు ఎలా? తగ్గించినా టికెట్ రేట్లతో అసలు పనవుతుందా .. లేదా? అన్న ఆందోళన బయ్యర్లలో నెలకొంది.
ఏపీ-100కోట్లు.. సీడెడ్ 40కోట్లకు ఆర్.ఆర్.ఆర్ హక్కులు అమ్మారు. అంటే ఆ రేంజును మించి షేర్ వసూలు చేస్తేనే గిట్టుబాటు అయినట్టు. అయితే అంత భారీ వసూళ్లను సాధించాలంటే టికెట్ రేట్లు పెంచుకుంటేనే సాధ్యమవుతుంది. అది కూడా 300 అంతకుమించి టికెట్ ధర ఉంటేనే రిటర్నులు సాధ్యమని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే అందుకు అనుమతించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అంటే లేనే లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
రూ.100- రూ.150 టికెట్ రేంజు ధరలతో టికెట్లను అమ్మేసినా .. బ్లాక్ లో అదనపు మొత్తాల్ని రాబట్టినా కానీ .. బ్లాక్ బస్టర్ సినిమాలే భారీ వసూళ్లను తేలేకపోయాయి. ఇటీవల విడుదలైన అఖండ వైజాగ్ -6కోట్లు పుష్ప వైజాగ్ -7 కోట్లు మాత్రమే వసూలయ్యాయని చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలో మరిన్ని కఠిన ఆంక్షలు ఉన్నాయి.
ఇటీవలి కట్టడి నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలు భారీ చిత్రాల సన్నివేశమేంటో అర్థం కాని గందరగోళంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్.ఆర్ఆర్ .. వైజాగ్ ఏరియా 25కోట్లు పైగా తేవాల్సి ఉండగా.. ఇప్పటి టికెట్ రేటుతో అది సాధ్యం కాదని భావిస్తున్నారు. అంత పెద్ద మొత్తం వసూలవ్వాలి.. అంటే టికెట్ రేటు ఫ్లాటుగా రూ.300 కాస్ట్ అమ్మాలి..
తూగో లో.. అఖండ కు 4కోట్లు.. పుష్ప -4కోట్లు మాత్రమే వసూలు చేయగా.. అమ్మకాల్లో సగం వసూళ్లే తెచ్చాయన్న గుసగుసా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్.ఆర్.ఆర్ 17కోట్ల రేంజు వసూలు చేయాలంటే ఇప్పటి టికెట్ రేట్లతో సాధ్యమయ్యే పనేనా? అని ఆందోళన నెలకొందట. కొన్ని సింగిల్ థియేటర్ల ముందు రూ.20.. రూ.10 అంటూ టికెట్ రేట్ల బోర్డులు కనిపించడం విచిత్రంగా మారింది.
ఇక సంక్రాంతి సీజన్ అయినా ఏపీలో అయితే రిటర్నులు కష్టమేనని బయ్యర్లలో ఆందోళన నెలకొందిట. ఇటీవల చాలా థియేటర్లను సీజ్ చేసినవాటిని తెరుస్తారో లేదో అనేది క్లారిటీ లేదు. దీంతో భారీ మొత్తాలు పెట్టి కొనుక్కున్న బయ్యర్లు పంపిణీ వర్గాలు ఆందోళనలో ఉన్నారు. 50శాతం తగ్గిస్తేనే గిట్టుబాటు అని నిర్మాత దానయ్య దృష్టికి తెచ్చారట.
బయ్యర్లు రేట్లు తగ్గంచాలని కోరుతున్నారట. అలాగే ఏపీలో టికెట్ ఇంతకుముందులా 100-150 రేటు ఉంటుందో లేదో అన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారట. అగ్ర నిర్మాత కం పంపిణీ దారుడు సాయికొర్రపాటి సారథ్యంలో నిర్మాత దానయ్యను బయ్యర్లు పంపిణీ వర్గాలు నేడు సమావేశం కానున్నారని తెలిసింది. నేటి సమావేశంలో ఏం తేలుస్తారో చూడాలి.