Begin typing your search above and press return to search.
RRR వర్సెస్ KGF 2.. సంక్రాంతి వార్ నిజమా?
By: Tupaki Desk | 7 March 2020 7:40 AM GMTకన్నడ స్టార్ యశ్ కథానాయకుడి గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాప్టర్-2` వాయిదాల ఫర్వం గురించి తెలిసిందే. RRR జూలై నుంచి పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ తేదీని కేజీఎప్ -2 కోసం లాక్ చేశారని ప్రచారమైంది. కానీ అప్పటికి షూటింగ్ తప్ప మిగతా పనులేవి పూర్తవ్వని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో గానీ...సెప్టెంబర్ గానీ రిలీజ్ అయ్య అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా ఇది కూడా మారిందని తెలుస్తోంది. ఆ తేదీల్లో కాకుండా ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా సంక్రాంతి సీజన్ లోనే కేజీఎఫ్-2ని కూడా రిలీజ్ చేస్తారని కొత్త ప్రచారం వేడెక్కిస్తోంది.
అయితే రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడం సరైనదేనా? అంటే ఏమాత్రం ఒప్పుకోలేని పరిస్థితి ఉంది. బాక్పాఫీస్ షేరింగ్ వల్ల ఇరు సినిమాలకు డ్యామేజ్ జరుగుతుందనే భావిస్తున్నారు. జాతీయ మీడియాలో ఇప్పటికే ఆ రెండూ సంక్రాంతి బ్యాటిల్ కి సిద్ధం అంటూ ప్రచారం మార్మోగిపోతోంది. అయితే తాజాగా కేజీఎఫ్ హీరో యశ్ ఈ రూమర్లని ఖండించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా వెళ్లమని..తమకంటూ ప్రత్యేకమైన ఓ తేదీని చూసుకుని రిలీజ్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడో బలమైన రీజన్ కూడా చెప్పుకోచ్చాడు. కేజీఎప్-2... ఆర్.ఆర్.ఆర్ చిత్రాలను బాలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అనీల్ తడానీ హక్కులు దక్కించుకున్నారట. కాబట్టి సంక్రాంతి సీజన్ లో కేజీఎఫ్-2ను రిలీజ్ చేసే ఛాన్సే లేదని చెబుతున్నాడు.
ఒకరికొకరం పోటీపడే చాన్సే లేదని యశ్ కుండ బద్దులు కొట్టేసారు. దీంతో ఆర్ ఆర్ ఆర్- కేజీఎప్ 2 ఎట్టి పరిస్థితిలో ఒకే సీజన్ లో గానీ...దగ్గర తేదీల్లో గానీ రిలీజ్ కావని తేలిపోయింది. పాన్ ఇండియా సినిమాలు కాబట్టి భారత్ సహా వరల్డ్ మొత్తం ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోనున్నారు. రిలీజ్ లో ఏ మాత్రం ముందు వెనకా అయినా పైరసీ పాలవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల కోట్లాది రూపయాల నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. ఇలాంటి ఎన్నిటినో విశ్లేషించుకుని పాన్ ఇండియా చిత్రాల్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే ఇరు టీమ్ లు ఆలోచిస్తున్నాయిట.