Begin typing your search above and press return to search.
ఆర్ఆర్‌ఆర్ వర్సెస్ కేజీఎఫ్ 2... కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ఏది?
By: Tupaki Desk | 15 May 2022 6:36 AM GMT2020 సంవత్సరం ఆరంభం నుండి మొదలుకుని 2021 చివరి వరకు.. 2022 ఆరంభంలో కూడా కరోనా కల్లోలం వల్ల సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించింది. ఆ సమయంలో ప్రేక్షకులు ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు సినిమాలను చూడమంటే చూస్తారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఈ ఏడాది మార్చి నుండి విడుదల అవుతున్న సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తూ కుమ్మేస్తున్నాయి.
ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో పలు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోగా ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఎఫ్ 2 లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. ఏరియాల వారిగా చూసుకుంటే ఒకొక్క చోట ఒక్కో విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా రాబట్టింది.. ఇక ఉత్తర భారతంలో కేజీఎఫ్ 2 ఏకంగా బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కు నెట్టింది.
రెండు సినిమాల మద్య వసూళ్ల వ్యత్యాసం అటు ఇటుగా 60 నుండి 70 కోట్ల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 కాస్త ఎక్కువ వసూళ్లు నమోదు చేసినా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కమర్షియల్ గా పై చేయి సాధించినట్లు అంటూ తెలుగు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటీ అంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే కాకుండా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తాన్ని దక్కించుకుంది.
కేజీఎఫ్ 2 సినిమా విషయానికి వస్తే ఓటీటీ మరియు శాటిలైట్ బిజినెస్ విషయంలో ఆర్ఆర్ఆర్ కంటే తక్కువే అనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. అయితే నిర్మాతల షేర్ విషయంలో మాత్రం కేజీఎఫ్ 2 నిర్మాతలకు ఎక్కువ లాభం దక్కి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.