Begin typing your search above and press return to search.

సీజ‌న్ మారినా RRR, రాధేశ్యామ్ మ‌ధ్య పోటీ త‌ప్ప‌దు

By:  Tupaki Desk   |   6 Jan 2022 1:30 PM GMT
సీజ‌న్ మారినా RRR, రాధేశ్యామ్ మ‌ధ్య పోటీ త‌ప్ప‌దు
X
సంక్రాంతికి ఈ సారి ఓ రేంజ్ లో హంగామా వుంటుంద‌ని, పెద్ద సినిమాల‌లో ఈ సీజ‌న్ మోతెక్కిపోతుంద‌ని అంతా బావించారు. కానీ దేశ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితులు.. ఒమిక్రాన్‌, క‌రోనా కేసుల రికార్డు స్థాయిలో పెర‌గిపోతున్న నేప‌థ్యంలో భారీ చిత్రాల రిలీజ్‌ల‌ని వాయిదా వేశారు. దీంతో పండ‌గా సీజ‌న్ స‌ప్ప‌గా సాగ‌బోతోంది.

ఉత్త‌ర భార‌తంలో ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్ వంటి ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు నైట్ క‌ర్ఫ్యూకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అంతే కాకుండా క‌ర్ణాట‌క‌, త‌మిళ నాడు రాష్ట్రాల్లోనూ ఆదివారం కంప్లీట్ లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డం వంటి కార‌ణాల‌తో చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి.

దీనికితోడు 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ కొన్ని రాష్ట్రాలు మ‌ళ్లీ పాత నిబంధ‌న‌ల‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చాయి. ఇది పెద్ద సినిమాల‌కు భారీ దెబ్బ‌గా మార‌తుంది. ఈ అంశాల‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ లని మేక‌ర్స్ చివ‌రి నిమిషంలో వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. వారం వ్య‌వ‌ధిలో ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ రెండు చిత్రాలు వాయిదా ప‌డ‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు భారీ షాక్ గా మారింది.

అయితే సంక్రాంతికి వాయిదా ప‌డిన ఈ రెండు పాన్ ఇండియ‌న్ మూవీస్ స‌మ్మ‌ర్ సీజ‌న్ ని టార్గెట్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు త‌ప్పిన పోటీ స‌మ్మ‌ర్ లో మ‌ళ్లీ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. రాధేశ్యామ్ మార్చి 18న రాబోతోంది. `ఆర్ ఆర్ ఆర్‌` ఏప్రిల్ ని టార్గెట్ చేసింద‌ట‌. అలా అయినా ఇద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ బాక్సాఫీస్ ని షేర్ చేసుకోక త‌ప్ప‌ద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అయితే అప్పుడు కూడా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితేనే ఈ మూవీలు రిలీజ్ అవుతాయ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో, ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఒమిక్రాన్ తో పాటు క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న ప‌రిణామాల‌ని బ‌ట్టి లాక్ డౌన్ లేదా నైట్ క‌ర్ఫ్యూలు విధించే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. అయితే థ‌ర్డ్ వేవ్ ప్ర‌కంప‌ణల నేప‌థ్యంలో ఈ వాతావ‌ర‌ణం ఎంత వ‌ర‌కు వుంటుంది? ఎప్పుడు ఫ్రీ అవుతుంది అన్న‌ది మాత్రం ఎవ‌రికీ క్లారిటీ లేదు.

దీంతో ప‌రిస్థితులు మార‌క‌పోతే భారీ చిత్రాలు విడుద‌ల కష్ట‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. పూర్తిగా వాతావ‌ర‌ణం అదుపులోకి వ‌చ్చాకే త‌మ సినిమాల‌ని విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని, లేదంటే న‌ష్టాల‌ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే భారీ న‌ష్టాల‌ని చ‌విచూడ‌ల్సి వ‌స్తుంద‌ని ట్రేడ్ పండితులు హెచ్చ‌రిస్తున్నారు.