Begin typing your search above and press return to search.

RRR టాకీ పూర్తి.. ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న కోస‌మే వెయిటింగ్!

By:  Tupaki Desk   |   26 Aug 2021 1:30 PM GMT
RRR టాకీ పూర్తి.. ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న కోస‌మే వెయిటింగ్!
X
RRR రాక కోసం రెండేళ్లుగా అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా షూటింగ్ ర‌క‌రకాల ఇబ్బందుల న‌డుమ చేయాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఉక్రెయిన్ లో RRR ప్రధాన షెడ్యూల్ పూర్త‌యింది. చిత్ర‌బృందం ఇటీవల హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. నిర్మాత‌లు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసారు.

RRR మొత్తం షూటింగ్ పూర్తయింది. కొన్ని పికప్ షాట్ లు మిన‌హా. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మరికొన్ని అప్ డేట్స్ ని అందిస్తాం... అని ప్ర‌క‌టించారు. దీంతో RRR బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ద‌స‌రా బ‌రిలో RRR అక్టోబర్ 13 న విడుదల చేస్తార‌నే భావిస్తున్నారు. కానీ షూటింగ్ ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో రిలీజ్ తేదీ మారుతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కానీ డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నుంచి కానీ అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది.

టాకీ పూర్త‌వ్వ‌డంతో ఎస్ఎస్ రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై తన దృష్టిని మరల్చి, సినిమా ప్రచార ప్రణాళికను రూపొందిస్తారు. ఇక‌పై రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ తమ త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారిస్తున్నారు. చ‌ర‌ణ్ త‌దుప‌రి శంక‌ర్ తో సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతుండ‌గా.. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభించేందుకు ఏర్పాట్ల‌లో ఉన్నారు.

వాయిదాకే ఆస్కారం ఉందా?

సెకండ్ వేవ్ అనంత‌రం థియేట‌ర్ల‌ను తెరిచేందుకు అనుమ‌తులు ఉన్నా కానీ చాలా చోట్ల ఎగ్జిబిట‌ర్లు ఇంకా ఆ మూడ్ లోకి రాలేదు. అలాగే ఇటీవ‌ల రిలీజైన సినిమాల రిజ‌ల్ట్ కూడా ఆశించినంత‌గా లేదు. స‌ల్మాన్ - రాధే.. అక్ష‌య్ కుమార్ - బెల్ బాట‌మ్ చిత్రాలు అంతంత మాత్రంగానే వ‌సూలు చేయ‌డం నిజంగా నిరాశ‌ను క‌లిగించింది. రాధే ఫ్లాపైనా బెల్ బాట‌మ్ కి వ‌చ్చిన మంచి స‌మీక్ష‌ల దృష్ట్యా భారీ వ‌సూళ్ల‌ను సాధించాలి. కానీ ఆశించిన స్థాయికి ఇది చేర‌లేక‌పోయింది. దానికి కార‌ణం ఇంకా ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చేందుకు ఆస‌క్తిగా లేక‌పోవ‌డ‌మే.

అందుకే 2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై చిత్ర‌బృందం మ‌రోసారి అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కూ స‌స్పెన్స్ త‌ప్పేట్టు లేదు. వాయిదానా.. య‌థాత‌థంగా చెప్పిన తేదీకే రిలీజ‌వుతుందా? అన్న‌ది ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఒక‌వేళ `ఆర్.ఆర్.ఆర్` నిజంగా వాయిదా ప‌డితే మాత్రం ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తోన్న `అఖండ‌`.. మాస్ రాజా ర‌వితేజ‌ న‌టిస్తోన్న `ఖిలాడీ` స‌హా మీడియం రేంజ్ చిత్రాల‌తో పాటు.. చిన్న‌ బ‌డ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషుకులు భావిస్తున్నారు. చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ లకు వెళ్ల‌లేక‌.. థియేట‌ర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడున్న డైల‌మా క్లియరైపోతే.. థ‌ర్డ్ వేవ్ రాద‌న్న భ‌రోసా ల‌భిస్తే... చాలా సినిమాలు డిసెంబ‌ర్ లోపు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

నాని-ట‌క్ జ‌గ‌దీష్ .. నితిన్ - మాస్ట్రో.. వెంకీ దృశ్యం 2 ఓటీటీలో రిలీజ‌వుతున్నాయ‌న్న టాక్ ఉంది. నాగ‌చైత‌న్య‌ ల‌వ్ స్టోరి సెప్టెంబ‌ర్ 10న రిలీజ‌వుతోంది. అదే రోజు త‌లైవి కూడా వ‌స్తోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ మార్చి 2022 కి వాయిదా ప‌డింద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. జ‌క్క‌న్న దీనిపై అధికారికంగా వివ‌రాలు ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.