Begin typing your search above and press return to search.

RRR గ్లోబ‌ల్ మూవీ అయ్యే ఛాన్స్ లేదా?

By:  Tupaki Desk   |   29 May 2022 2:31 PM GMT
RRR గ్లోబ‌ల్ మూవీ అయ్యే ఛాన్స్ లేదా?
X
రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 1200 కోట్ల వ‌సూళ్ల‌తో మూడ‌వ స్థానంలో నిలిచింది. 'దంగ‌ల్'..'బాహుబ‌లి' త‌ర్వాత స్థానాన్ని 'ఆర్ ఆర్ ఆర్' ద‌క్కించుకుంది. పోటీగా 'కేజీఎఫ్' నిలిచినా ఆర్ ఆర్ ఆర్ ప్ర‌త్యేక‌త వేరు. తెలుగు రాష్ర్టాల్లో బాహుబ‌లి వ‌సూళ్ల‌నే చెరిపేసిన చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది.

మ‌రి ఈ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ చేసే ఆలోచ‌న జ‌క్క‌న్న మైండ్ లో లేదంటారా? గ్లోబ‌ల్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రీచ్ అవ్వ‌డం క‌ష్ట‌మంటారా? అంటే దాదాపు స‌మీక‌ర‌ణాలు అలాగే క‌నిపిస్తున్నాయి. బాహుబ‌లి రిలీజ్ అనంత‌రం చైనా..జ‌పాన్.. మ‌లేషియా..సింగ‌ర్ పూర్ లాంటి దేశాల్లో ప్ర‌త్యేకంగా రిలీజ్ చేసారు.

విదేశీ వెర్ష‌న్ క‌ట్ ని ప్ర‌త్యేకంగా డిజైన్ చేసి..ప్ర‌మోట్ చేసి రిలీజ్ చేసారు. ఆయా దేశాల్లోనూ బాహుబ‌లి ప్రాంచైజీ మంచి స‌క్సెస్ సాధించింది. దీంతో బాహుబ‌లి గ్లోబ‌ల్ మూవీగా నిలిచింది. కానీ 'ఆర్ ఆర్ ఆర్' విష‌యంలో అలాంటి చ‌ర్య‌ల‌కు జ‌క్క‌న్న పూనుకున్న‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇప్ప‌టికే 'ఆర్ ఆర్ ఆర్' ఓటీటీలో కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది.

అంత‌ర్జాతీయ స్థాయిలో హిందీ వెర్ష‌న్ ని నెట్ ప్లిక్స్ పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేసుకుంటుంది. దీన్ని బ‌ట్టి జ‌క్క‌న్న ఆర్ ఆర్ ఆర్ ని పాన్ వ‌ర‌ల్డ్ కి చేర్చే బాధ్య‌త‌లు పూర్తిగా ఓటీటీల‌కే అప్ప‌గించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆయ‌నంటూ ప్ర‌త్యేకంగా శ్రద్ధ పెట్ట‌లేదు. అయితే ఓటీటీ వెర్ష‌న్ ని ప్ర‌త్యేకంగా జ‌క్క‌న్న టీమ్ డిజైన్ చేసింది. థియేట్రిక‌ల్ రిలీజ్ కి ఓటీటీకి మ‌ధ్య వ్య‌త్యాసం చెప్పే ప్ర‌య్న‌తం చేసారు.

మ‌రి రాజ‌మౌళి ఇలా ఎందుకు లైట్ తీసుకున్న‌ట్లు? అంటే ఆర్ ఆర్ ఆర్ గ్లోబ‌ల్ మూవీ అయ్యే ఛాన్సెస్ త‌క్కువ‌గా ఉన్నాయ‌నే కోణంలోనే లైట్ తీసుకున్న‌ట్లు సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. బ్రిటీష్-ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీని విదేశీయులు ఎందుకు ఆద‌రిస్తారు? ఇందులో అంత టెక్నాల‌జీ ఏముంది? కంటెంట్ ప‌రంగానూ బ‌ల‌మైంది కాదు.

ఎమోష‌నల్ గానూ క‌నెక్ట్ అవ్వ‌డానికి ఛాన్సు లేదు. విజువ‌ల్ గానూ హైలైట్ చేయ‌డానికి స్కోప్ లేదు. గ్లోబ‌ల్ మూవీ అంటే యూనివ‌ర్శీల్ అప్పీల్ తప్ప‌నిస‌రి గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే హిందీ బెల్ట్ లో ఆర్ ఆర్ ఆర్ ఏ స్థాయి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇలా కొన్ని కార‌ణాల్ని విశ్లేషించుకునే..కొన్ని లెక్క‌లు బెరీజు వేసుకుని జక్క‌న్న పాన్ ఇండియా రీచ్ ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినట్లు గుస‌గుస వినిపిస్తుంది.