Begin typing your search above and press return to search.
RRR చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డ్..!
By: Tupaki Desk | 26 Oct 2022 8:30 AM GMTదర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ.. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికీ ఏదొక విధంగా అద్భుతాలు చేస్తూనే ఉంది.
RRR (రైజ్ - రోర్ - రివోల్ట్) సినిమా తాజాగా సాటర్న్ అవార్డును అందుకుంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో అవార్డు లభించినట్లు జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్.. ఈసారి ట్రిపుల్ ఆర్ ను బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మక అమెరికా అవార్డ్స్ లో తన చిత్రాన్ని విజేతగా ఎంపిక చేసినందుకు జ్యూరీకి రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేసారు.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా ఉప్పొంగిపోతున్నానని.. ఇది తనకు రెండో సాటర్న్ అవార్డు అని జక్కన్న పేర్కొన్నాడు. ఈ సందర్భంగా RRR టీమ్ తరపున ఇతర విజేతలను కూడా అభినందించారు. రాజమౌళి గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్' సినిమాకు గాను మొదటి సాటర్న్ అవార్డును అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత ఇటీవల జపాన్ దేశంలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అక్కడ కూడా ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం RRR త్రయం రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రస్తుతం తమ ఫ్యామిలీలతో కలిసి జపాన్ లో ఉన్నారు.
గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కిన తర్వాత RRR సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మన దేశం తరపున అకాడమీ అవార్డ్స్ పరిశీలనకు అఫిషియల్ ఎంట్రీగా ఈ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ ఆస్కార్ ప్రయత్నాలు వదిలిపెట్టలేదు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద ఆస్కార్ జ్యూరీ పరిశీలనకు పంపించారు. మొత్తం పదిహేను క్యాటగిరీలలో నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసారు. మరి ఈ సినిమా ఫైనల్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందో లేదో చూడాలి.
కాగా, 1920స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన RRR చిత్రంలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - శ్రియా శరన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.