Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ వీడియో : నెత్తురు మరిగితే ఎత్తర జెండా

By:  Tupaki Desk   |   12 March 2022 3:11 PM GMT
ఆర్ఆర్‌ఆర్‌ వీడియో : నెత్తురు మరిగితే ఎత్తర జెండా
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అంచనాలు పెంచే విధంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈనెల 14న ఎత్తర జెండా పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు.

ఆ పాట నుండి ప్రోమోను విడుదల చేశారు. నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటూ సాగే ఈ పాట 20 సెకన్ల విజువల్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో ఇద్దరు హీరోలతో ఆలియా భట్ ను కూడా చూడవచ్చు. ఇద్దరు హీరోలు మద్య లో ఆలియా భట్ ను చూస్తుంటే కన్నుల పండుగ మాదిరిగా.. విజువల్‌ వండర్ గా అనిపిస్తుంది. ఈ పాట మొత్తం విడుదల అయితే సినిమాపై ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.

రాజమౌళి సినిమా అంటే కీరవాణి అద్బుతమైన బాణీలు ఇస్తాడనే అభిప్రాయం ఉంది. ఈ ఎత్తర జెండా పాటకి కూడా ఆయన తనదైన శైలిలో మంచి మ్యూజిక్ ను ఇచ్చాడని ఈ 20 సెకన్ల ప్రోమోతో తేలిపోయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ మరియు విషయం కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా సినిమాపై అంచనాలను పెంచేస్తూనే ఉన్నాయి.

ఈ సమయంలో సినిమా నుండి రాబోతున్న ఈ పాట పై అందరి దృష్టి ఉంది. ఇద్దరు హీరోలతో ఉండే ఈ సెలబ్రేషన్ సాంగ్ నేపథ్యం ఏంటీ.. అసలు కథలో ఈ పాట ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. సినిమా లో ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించిన ఈ పాటతో మరింతగా ఒక స్పష్టత అనేది ఇస్తారేమో చూడాలి.

ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో పాటు శ్రియా శరన్‌ కూడా ఈ సినిమా లో నటించడంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపుగా నాలుగు ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఎట్టకేలకు విడుదల కు సిద్దం అవ్వడంతో జక్కన్న అభిమానులు మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలిని బీట్‌ చేయగల సత్తా కేవలం ఆర్ ఆర్‌ ఆర్‌ కే ఉందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది.