Begin typing your search above and press return to search.
రూ.1 విమాన ప్రయాణం రీల్ సక్సెస్ రియల్ ఫెయిల్
By: Tupaki Desk | 18 Nov 2020 9:50 AM GMTసూర్య హీరోగా నటించిన సూరారై పోట్రూ తమిళం మరియు తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో కాకుండా థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యి ఉంటే రెండు రాష్ట్రాల్లో కలిపి వంద కోట్లకు పైగా వసూళ్లు చేసేది అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ అనే విషయం తెల్సిందే. సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎయిర్ డెక్కన్ గురించి.. జీఆర్ గోపీనాథ్ గురించి నెట్ లో వెదుకుతున్నారు. ఇప్పుడు ఎయిర్ డెక్కన్ ఎందుకు లేదు.. రూపాయి విమాన టికెట్ ఎందుకు ఇప్పుడు కనిపించడం లేదు అనే అనుమానంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రూపాయికి విమానం ఎక్కించాలనే తపన పడ్డ హీరో కథ ఆకాశమే నీ హద్దుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది. అయితే రియల్ లైఫ్ లో మాత్రం పూర్తి విభిన్నం. రూపాయికి జనాలను విమానం ఎక్కించాలనే ఆలోచన సక్సెస్ అయ్యింది. కాని ఆయన ఆర్థికంగా మాత్రం నష్టపోవాల్సి వచ్చింది. 2003లో ఎయిర్ డెక్కన్ ను ప్రారంభించిన గోపీనాథ్ 2006వ సంవత్సరంలో రూపాయి టికెట్ విధానంను అమలు చేశాడు. రెండు సంవత్సరాల పాటు అది కొనసాగింది. రూపాయి టికెట్ పెడితే మెయింటనెన్స్ అన్ని కూడా కష్టం అవుతుంది. అదే జరిగింది. ఆయన అనుకున్నట్లుగా కాకుండా పరిస్థితులు రివర్స్ అయ్యాయి.
ఎయిర్ డెక్కన్ టికెట్ల కోసం థియేటర్ల వద్ద క్యూలో నిల్చున్నట్లుగా జనాలు నిలబడ్డ సందర్బాలు చాలా ఉన్నాయి. అందుబాటు ధరల్లో విమాన టికెట్ల రేట్లు రావడానికి ఎయిర్ డెక్కన్ కారణం అని చెప్పుకోవచ్చు. వందకు పైగా విమాన సర్వీసులను నడిపిన గోపీనాథ్ రెండు సంవత్సరాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు విజయ్ మాల్యాకు తన ఎయిర్ డెక్కన్ ను అమ్మేసి ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో ఒక సభ్యుడిగా చేరాడు. సినిమాలో సక్సెస్ అయిన ఆ స్టోరీ రియల్ లైఫ్ లో మాత్రం విఫలం అయ్యింది.