Begin typing your search above and press return to search.
వీళ్ళు జర్నలిస్టులా లేక స్క్రిప్ట్ రైటర్లా?
By: Tupaki Desk | 27 Feb 2018 1:48 PM GMTఎవరు ఊహించని ఒక చెడు సంఘటన జరిగితే వీలైనంత వరకు మనం నిజ నిజాలు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు తెలియకపోతే ఎవరికి ఉన్నవి లేనివి చెప్పం. కానీ మీడియా అలా కాదు. ఉన్నవి లేనివి కల్పించి అసలు ఆ సందర్భాన్ని పూర్తిగా ట్రాక్ మరిపోయేలా చేస్తుంది.
అందుకు ఉదాహరణ శ్రీదేవి మరణమే. సెలెబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్న ఒక్కగానొక్క నిజం శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం. ఆమె మనకు ఇంకా లేరు. మన మధ్య లేకున్నా మన మనస్సులో మాత్రం నిరంతరం బతికే ఉంటారు. ఈ చేదు నిజాన్ని ఇంకా అంగీకరించడానికి బాధపడుతున్న ప్రజలను మీడియా తన చెత్త వ్యాఖ్యలతో మరింత కలత చెందేలా చేస్తోంది. ఒకరేమో ఇది ఆత్మహత్య అన్నారు మరొకరు వచ్చి లేదు డ్రగ్స్ ప్రభావం అంటూ మాట్లాడారు. యూట్యూబ్ లో ఒక ఛానల్ అయితే మరీ ఘోరం. శ్రీదేవి ఓ వంద కోట్ల ఇన్సూరెన్స్ ఉందని. దాని కోసమే ఆమెని పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ హతమార్చారని రాసేశారు. శ్రీదేవి మరణాన్ని వీళ్లు ఒక క్రైమ్ థ్రిల్లర్ గా మార్చేశారు.
నిజానికి పైన వీరు పేర్కొన్న కుట్ర సిద్దాంతాలన్నీ చాలా తెలుగు మరియు తమిళ సినిమా కథలే. ఇన్సూరెన్స్ కోసం చంపడం.. డ్రగ్ ఓవర్డోస్.. ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో చూశాం. అయితే నిజాన్ని చెప్పాల్సిన జర్నలిస్టులు ఇలా కథలు చెబుతుంటేనే వినడానికి కష్టంగా ఉంది. ఇది ఎంత బాధాకరం? వీళ్ళని ఊరికే వదిలేస్తే సినిమా స్టోరీలు కూడా అల్లేస్తారు అంటూ ప్రజలు తిడుతున్నారు. మీడియా అంటేనే నిజాలని ప్రజలకు అందించేది. అలాంటి మీడియా ఇపుడు కథలు రాసుకుని ఫిల్మ్ మేకర్లు అయిపోతే ఎలా?