Begin typing your search above and press return to search.
రూ.100కోట్ల టెన్షన్.. మహేష్ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 3 Jun 2022 8:45 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక రికార్డు అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో అయితే మహేష్ స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
అందుకే నిర్మాతలు ఆయన తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మహేష్ బాబు తో సినిమా చేస్తే విడుదలకు ముందే ఈజీగా నిర్మాతలకు మినిమమ్ 50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పవచ్చు.
ఇక స్టార్ ప్రదర్శకులతో సినిమా ఉంటే మాత్రం వంద కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే కేవలం థియేట్రికల్ గానే కాకుండా మహేష్ బాబు సినిమాలకు ఇప్పుడు నాన్ థియేటరికల్ గా కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇక మహేష్ బాబు 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఎప్పుడైనా టెన్షన్ కలిగించిందా అనే ప్రశ్న ఎదుర్కొన్నాడు.
ఆ విషయంపై మహేష్ బాబు చాలా సున్నితంగా సమాధానమిచ్చాడు. నా సినిమాలు వంద కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి అంటే అందులో పెద్దగా అయితే టెన్షన్ పడను. ఒక ఒక విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. నా స్థాయి ఎంత వరకు పెరిగింది అనే విషయంలో నాకు కూడా ఒక క్లారిటీ ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాని వందకోట్ల టెన్షన్ అనేది నా జీవితంలో ఎప్పుడూ పెద్దగా ఉండదు అని మహేష్ తెలియజేశాడు.
ఇక కథల విషయంలో అయితే పెద్దగా చర్చలు జరపకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తు ఉంటాను అని కూడా మహేష్ తెలియజేశాడు. ఎవరైనా దర్శకుడు కథ చెబితే అది నచ్చిందా లేదా అనే విషయంపై చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటానని పెద్దగా ఎవరితోనూ డిస్కస్ కూడా చేయనని అన్నారు.
ఇక మేజర్ సినిమా విషయంలో అడవి శేష్ కథ చెప్పినప్పుడు కూడా అలాగే నిర్ణయం తీసుకున్నాను అంటూ.. హీరోగా నిర్మాతగా కథల విషయంలో ఎప్పుడూ నా నిర్ణయాలు చాలా స్పీడ్ గానే ఉంటాయని మహేష్ వివరణ ఇచ్చాడు.