Begin typing your search above and press return to search.
200 కోట్ల స్కామ్: జాకీ ఫారిన్ వెళ్లే ఛాన్సే లేదు!
By: Tupaki Desk | 24 Dec 2022 3:57 AM GMT200 కోట్ల దోపిడీ - మోసం కేసులో అరెస్టయిన కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్ వ్యవహారంతో ముడిపడిన ప్రముఖ కథానాయికల గుట్టంతా ఈడీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో జాక్విలిన్ ఫెర్నాండెజ్.. నోరా ఫతేహి సహా పలువురు కథానాయికలు టాప్ మోడల్స్ కూడా ఉన్నారనేది ఈడీ వర్గాల శోధనలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు విధించారు.
కానీ విదేశాల్లో తన తల్లిదండ్రులను కలిసేందుకు అనుమతిని కోరుతూ కోర్టుకు అప్పీల్ కి వెళ్లింది జాక్విలిన్. కానీ ఇప్పుడు అందుకు ఆస్కారం లేదు. విదేశాలకు వెళ్లాలన్న పిటిషన్ ను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వయంగా ఉపసంహరించుకున్నారు. ఫెర్నాండెజ్ బహ్రెయిన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేసినా కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారని జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి.
ఈ పిటిషన్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యంతరం వ్యక్తం చేయడంతో గురువారం నాడు జాకీ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారు. 200 కోట్ల దోపిడీ కేసు నడుస్తోంది. ఈ కేసులో జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక నిందితురాలు. ఈడీ తన అనుబంధ చార్జిషీటులో రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో పాటు జాక్విలిన్ కూడా ఒక భాగం అని పేర్కొంది. ఈడీ ప్రకారం.. సుకేష్ చంద్రశేఖర్ నుండి ఖరీదైన బహుమతులు అందుకున్న ఫెర్నాండెజ్ కు అతని నేర నేపథ్యం గురించి బాగా తెలుసు. ఫెర్నాండెజ్ కు దేశం విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. డిసెంబర్ 2021లో ముంబై విమానాశ్రయంలో కూడా జాక్విలిన్ ని ఆపివేయడానికి కారణం కడా ఇదే.
కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది: ఫెర్నాండెజ్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ శైలేంద్ర మాలిక్ కేసు కీలక దశలో ఉందని చెప్పారు. "మీరు మీ తల్లిని కలవాలనుకుంటున్నారనేది నేను అర్థం చేసుకున్నాను. మా తల్లిదండ్రుల పట్ల మేమంతా భావోద్వేగంతో ఉంటాం. అయితే మీరు ఇంత కీలక సమయంలో విదేశాలకు ఎందుకు వెళ్లాలి? మీరు దరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. ఛార్జి షీట్ క్వశ్చనింగ్ కి ముందుగా నిర్ణయించుకోవచ్చు. లేకుంటే జ్యుడిషియల్ ఆర్డర్ వేస్తాను" అని న్యాయమూర్తులు అన్నారు.
ED అభ్యంతరంతోనే.. నిజానికి ఫెర్నాండెజ్ విదేశాలకు వెళతానన్న విజ్ఞప్తిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెర్నాండెజ్ పిటిషన్ పై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ తరుణంలో సదరు నటీమణి విదేశాలకు వెళ్లడం ఆచరణీయం కాదని ED తన అభ్యంతరంలో పేర్కొంది. "ఆమె ఒక నటి.. తన కెరీర్ ఇక్కడ నాశనం అయినప్పటికీ ఆమె విదేశాలకు వెళ్లడం లాభదాయకం కాదు.. మాలో కొంత భయం ఉంది" అని ED తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
ఈ వాదన అనంతరం జాక్విలిన్ తన లాయర్ ని సంప్రదించి పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఫెర్నాండెజ్ ఎలాంటి కోర్టు విచారణను దాటవేయరని సదరు న్యాయవాది హామీ ఇచ్చారు. ప్రాథమిక నిందితుడి (చంద్రశేఖర్) పై కేసు తదుపరి తేదీ (జనవరి 6)న కోర్టులో వాదిస్తారని ఫెర్నాండెజ్ కేసులో "కీలక మలుపునకు కొంత సమయం పడుతుంద"ని ఆమె లాయర్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఫెర్నాండెజ్ తల్లి గుండెపోటుతో బహ్రెయిన్ లోని ఆసుపత్రిలో చేరారు. అనంతరం జాక్విలిన్ తనను కలవాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఈడీతో చిక్కుముడులు వీడలేదు. కోర్టు పరిధిలోను తనకు అనుకూల తీర్పు వెలువడలేదు. ప్రస్తుతం కాన్ మన్ సుకేష్ చంద్రతో సహనిందితురాలిగా జాక్విలిన్ పేరు జాబితాలో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.