Begin typing your search above and press return to search.
రూ.50 కోట్ల సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా రావడం లేదట
By: Tupaki Desk | 21 March 2021 12:30 PM GMTమంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మోసగాళ్లు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను మంచు విష్ణు కథపై నమ్మకంతో ఏకంగా రూ.50 కోట్లు పెట్టి తెరకెక్కించాడు. అప్పుడప్పుడు సాహసాలు చేయాలి అంటూ ఈ సాహసం చేశానంటూ విష్ణు ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. 51 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసినా కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా సినిమా ను జనాలు పట్టించుకుంటున్నట్లుగా అనిపించడం లేదు. దాంతో సినిమాకు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా పాతిక కోట్లకు నిర్మాత విష్ణు అమ్మేశాడు. దాంతో మరో పాతిక కోట్లు రాబడితే సినిమా బడ్జెట్ ను రికవరీ చేసినట్లుగా అనుకున్నారు. పాతిక కోట్ల టార్గెట్ తో థియేటర్లకు వచ్చిన మంచు విష్ణు మోసగాళ్లు మొదటి రెండు రోజులు రాబట్టిన వసూళ్లు మరీ షాకింగ్ గా ఉన్నాయి. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా కనీసం కోటి రూపాయల షేర్ ను కూడా రాబట్టలేక పోయింది. సినిమా లాంగ్ రన్ లో పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చును కూడా రాబట్టలేదేమో అంటున్నారు. ఇది మంచు విష్ణు కెరీర్ లో అతి పెద్ద కమర్షియల్ ప్లాప్ గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.