Begin typing your search above and press return to search.
#RT68 `రామారావ్ ఆన్ డ్యూటీ` కథంతా లీకైందిగా!
By: Tupaki Desk | 14 July 2021 4:47 AM GMTక్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజ్ రవి తేజ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాజా అల్లాడిస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` చిత్రీకరణను పూర్తి చేశాడు. తదుపరి # RT68 లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి `రామారావు ఆన్ డ్యూటీ` అనే టైటిల్ ని ప్రకటించారు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఒక్క పోస్టర్ తో వంద సందేహాల్ని రేకెత్తించాడు మాస్ రాజా!
ఇంతకీ ఇది క్రాక్ కి సీక్వెల్ తరహానా? అందులో కాప్ గా నటిస్తే ఈ చిత్రంలో అతడు ఒక ప్రభుత్వ అధికారిగా మారాడా? అంటూ డౌట్లు పుట్టించేశాడు. పోస్టర్ లో చిత్తూరు నంబర్ ప్లేట్ (ఎపి 03) ను కలిగి ఉన్న కారు ఉంది. ఇది ప్రభుత్వ వాహనం అని అర్థమవుతోంది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారా? అధికారి బ్లాక్ గాగుల్స్ లో కొన్ని గుప్తనిధులతో కంటైనర్ ల ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఇది మైనింగ్ మాఫియా లేదా ఎర్రచందనం స్మగ్లర్లను ఆట కట్టించే అధికారి కథాంశమా? అన్న సందేహాన్ని కూడా రేకెత్తించాడు. అలాగే రామారావ్ ఆన్ డ్యూటీ లోగోని పరిశీలిస్తే సగం మేక సగం పులి రూపం దేనికి సింబాలిక్? మేక వన్నె పులి అనుకోవచ్చా...! అంటే ముసుగు దొంగల్లా గనుల్ని ప్రభుత్వ సంపదల్ని దోచేసే కొందరు అరాచకీయుల అంతం చూసేవాడిగా ఈ చిత్రంలో మాస్ రాజా కనిపిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేసేందుకు లేదా డబుల్ గేమ్ ఆడేవాడిగా ముసుగు వేసుకుని తిరిగే అధికారిగా కనిపించేందుకు ఆస్కారం లేకపోలేదని అంచనా వేయొచ్చు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే ఓ పవర్ ఫుల్ కథాంశాన్ని దర్శకుడు ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. ఒకవేళ ఇది ఎర్రచందనం దొంగల అరాచకాల్ని అరికట్టే అధికారి కథ అయితే కొంతవరకూ పుష్పతో కనెక్టివిటీ ని జనం చూస్తారు. అలా కాకుండా మైనింగ్ మాఫియా కథాంశం అనగానే కేజీఎఫ్ లింకుల్ని కూడా తవ్వి తీస్తారు! ఏదేమైనా ఆ రెండిటి ప్రభావం పడకుండా వాటికి డిఫరెంటుగా `రామారావు ఆన్ డ్యూటీ`లో ఏం చూపిస్తారన్నదే ఇక్కడ విజయానికి కీలకం కానుంది. మరిన్ని వివరాలు కోసం మరికొంతకాలం వేచి చూడాలి.