Begin typing your search above and press return to search.

RRR కోసం RTC బస్సులు..?

By:  Tupaki Desk   |   24 March 2022 3:30 PM GMT
RRR కోసం RTC బస్సులు..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR చిత్రాన్ని జనాల వద్దకు చేర్చడానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలూ చేశారు.

ఏదైతేనేం కోవిడ్ పాండమిక్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రేపు (మార్చి 25) భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈరోజు గురువారం యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఫస్ట్ టాక్ బయటకు రానుంది.

RRR చిత్ర యూనిట్ కోసం నిర్మాత డివివి దానయ్య రేపు శుక్రవారం కూకట్‌ పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌ లో స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షో కోసం ఎవరెవరు వస్తారనేదానిపై సమాచారం లేనప్పటికీ.. సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ - నటీనటులు వస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎప్పుడూ రద్దీగా ఉండే కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న థియేటర్ వద్ద ట్రాఫిక్ జామ్‌ ఏర్పడే అవకాశం ఉన్నందున.. టీమ్ అంతా సినిమా చూడటానికి తమ వ్యక్తిగత వాహనాలలో రావడం లేదట. దీని కోసం స్పెషల్ గా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారట.

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' బృందం ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీతో మాట్లాడి థియేటర్ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. రేపు ఎర్లీ మార్నింగ్ అందరూ నిర్మాత ఆఫీస్ నుంచి ఈ బస్సుల్లో బయలుదేరి సినిమా హాలుకు చేరుకుంటారట. ఆ తరువాత అదే బస్సులో రిటర్న్ అవుతారట.

జక్కన్న ఇదంతా ప్రమోషనల్ ప్లాన్‌ లో భాగంగా చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో మరి. ఏదైతేనేం 'బాహుబలి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంతో మరో విజువల్ వండర్ ని ఆవిష్కరిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.