Begin typing your search above and press return to search.
ఆర్టీసీ డ్రైవర్ కొడుకు.. పాన్ ఇండియా స్టార్! యశ్ లైఫ్ స్టోరీ!
By: Tupaki Desk | 9 Jan 2021 2:30 AM GMTమనసావాచా.. సాధించాలని కంకణం కట్టుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ సూక్తి నిజం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ‘కేజీఎఫ్’ స్టార్ యశ్! ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా సినిమా అవకాశాల వేట మొదలు పెట్టిన యశ్.. నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే.. అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతని లైఫ్ ఏంటి? అనే వివరాల కోసం ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు.
ఒకే ఒక్క సినిమాలో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యశ్. కేజీఎఫ్ రాఖీ భాయ్ గా నేషనల్ వైడ్ పాపులారిటీ సాధించాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ రోజు యశ్ 35వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ చాప్టర్-2 టీజర్ కూడా ప్రభంజనం sRష్టిస్తోంది. ప్రపంచ రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986 జనవరి 8న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు యశ్.అతని తండ్రి కెఎస్ ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవారు.
అయితే.. మైసూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న నవీన్.. వెంటనే సినిమా అవకాశాల వేటలో పడ్డాడు. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో అవకాశం సంపాదించాడు. ఆ తరువాత యశ్ గా పేరు మార్చుకొని మెల్లమెల్లగా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోకి మారిపోయాడు. 2008లో రాధిక పండిట్ సరసన 'మోగ్గినా మనసు' చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రాధిక పండిట్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు ఐరా, కుమారుడు యథర్వ్ ఉన్నారు. కూతురు 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో కుమారుడు జన్మించాడు. మేమిద్దరం.. మాకిద్దరూ అంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది యశ్ ఫ్యామిలీ.
కాగా.. ఇప్పుడు కేజీఎఫ్ మూవీతో యశ్ సాధించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. రూ.200 కోట్లు వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు యశ్. కేజీఎఫ్ తర్వాత ప్రతీ సినిమాకు యశ్ రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ తొలి పార్ట్ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో అందరి చూపూ చాప్టర్-2పైనే పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ దుమ్ము లేపుతోంది.