Begin typing your search above and press return to search.
రుద్రమ ఆ క్లబ్బులోకి వచ్చేసింది
By: Tupaki Desk | 6 Nov 2015 6:28 AM GMTమొత్తానికి బాక్సాఫీస్ యుద్ధంలో రుద్రమదేవి విజయం సాధించిందనే చెప్పాలి. విడుదలకు ముందే కాదు, తర్వాత కూడా రుద్రమదేవి ప్రతాపం గురించి చాలా సందేహాలున్నాయి జనాలకు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ, డివైడ్ టాక్ ను తట్టుకుని మరీ బాక్సాఫీస్ లో జయకేతనం ఎగుర వేసింది గుణశేఖర్ సినిమా. ఇప్పటికే 50 కోట్ల షేర్ క్లబ్బులో అడుగుపెట్టిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది రుద్రమదేవి. ప్రస్తుతం నాలుగో వారంలో ఉన్న రుద్రమదేవి ఆంధ్రా ఏరియాలో దాదాపుగా పరుగు ఆపేసింది కానీ.. నైజాం ఏరియాలో మాత్రం ఇప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లలో ఆడుతోంది. అక్కడ కలెక్షన్ల షేర్ దాదాపు రూ.16 కోట్లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బౌండరీస్ దాటి కూడా రుద్రమిదేవి సత్తా చాటింది. తమిళనాడు - కర్ణాటక - కేరళల్లోనూ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇక ఆశ్చర్యకరంగా యుఎస్ లోనూ ‘రుద్రమదేవి’ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. అక్కడ ఈ సినిమా మిలియన్ క్లబ్ అందుకుని ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ని మినహాయిస్తే.. యుఎస్ లో సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లకే మంచి వసూళ్లు దక్కుతాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రుద్రమదేవి’ అక్కడ నిలబడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే అక్కడ కూడా ‘రుద్రమదేవి’ లాంగ్ రన్ రావడం.. మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.