Begin typing your search above and press return to search.
వారం లేటుగా రుద్రమదేవి
By: Tupaki Desk | 5 Oct 2015 9:30 AM GMTరుద్రమదేవి మళ్లీ వాయిదా పడిపోతోందేమో అని అసహనానికి గురవకండి. తెలుగులో ఈ సినిమా ఈ నెల తొమ్మిదో తారీఖునే వచ్చేస్తోంది. విడుదలపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఐతే వేరే భాషల్లో మాత్రం 9న రావట్లేదు. తమిళ వెర్షన్ వరకు రిలీజ్ డేట్ మార్చేశారు. వారం లేటుగా ఈ నెల 16న ‘రుద్రమదేవి’ తమిళ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. 9వ తారీఖున అక్కడ పోటీ ఎక్కువగా ఉండటం వల్లో, రిలీజ్ కు సన్నాహాలు పూర్తి కాకపోవడం వల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లున్నారు. మరోవైపు హిందీ వెర్షన్ విషయంలోనూ డౌట్లున్నాయి. అక్కడ కూడా 9న విడుదల కాకపోవచ్చని అంటున్నారు.
ఐతే సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్న గుణశేఖర్.. తెలుగులో మంచి టాక్ వస్తే.. అది తమిళ - హిందీ వెర్షన్ల మీద అంచనాలు పెంచుతుందని.. ప్రమోషన్ కు కూడా బాగా పనికొస్తుందని ఆశిస్తున్నాడు. తెలుగులో 9న 3డీ - 2డీ రెండు వెర్షన్ లలోనూ ‘రుద్రమదేవి’ విడుదలవుతోంది. రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ తెలుగులో దాదాపు వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. తర్వాతి వారం బ్రూస్ లీ విడుదలవుతున్న నేపథ్యంలో రుద్రమదేవి తొలి వారంలోనే సాధ్యమైనంత ఎక్కువగా వసూళ్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగు వెర్షనే రూ.50 కోట్లయినా వసూలు చేస్తే తప్ప గుణశేఖర్ గట్టెక్కడం కష్టం.