Begin typing your search above and press return to search.

రుద్రమదేవి.. లాభమా? నష్టమా?

By:  Tupaki Desk   |   17 Nov 2015 5:59 AM GMT
రుద్రమదేవి.. లాభమా? నష్టమా?
X
రుద్ర‌మ‌దేవి 3డి ఎట్ట‌కేల‌కు రిలీజై విజ‌యం సాధించింద‌న్న ప్ర‌చారం సాగింది. రెండేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత ఈ సినిమా రిలీజ‌వ్వ‌డం ఓ మిరాకిల్‌. బ‌న్ని లాంటి స్టార్ హీరో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం ఈ సినిమాని పూర్తిగా గ‌ట్టెక్కించింద‌నే చెప్పాలి. రుద్ర‌మ‌దేవి రిలీజైన మొద‌టి రోజు ఆడియెన్ నుంచి పెద‌వి విరుపులు క‌నిపించినా కాల‌క్ర‌మంలో గోన గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్ సినిమాని ఫ్లాప‌వ్వ‌కుండా కాపు కాచింద‌ని చెప్పుకున్నారు. ఏదేమైనా గుణ‌శేఖ‌రుడు భారీ న‌ష్టాల నుంచి బైట‌ప‌డిన‌ట్టే.

అయితే అస‌లు రుద్ర‌మ‌దేవి హిట్టా? ఫ‌్లాపా? వ‌సూళ్లు ఎంత‌? అన్న డీటెయిల్స్ వ‌చ్చాయిప్పుడు. ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో ఏపీ, తెలంగాణ స‌హా ఓవ‌ర్సీస్ క‌లుపుకుని దాదాపు 85 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇందులో 50 కోట్లు షేర్ ఉంటుంది. కేవ‌లం తెలుగు రాష్ర్టాల వ‌సూళ్లు తీసుకుంటే 50 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌సూలైంది. ఇందులో 30 కోట్లు షేర్ ఉంటుంద‌ని అనుకుంటే.. న‌ష్టాలు షురూ అని అర్థ‌మ‌వుతోంది. రుద్ర‌మ‌దేవి వాస్త‌వ బ‌డ్జెట్ 70 కోట్లు పైమాటే. దీన్నిబ‌ట్టి ద‌ర్శ‌క‌నిర్మాత‌గా గుణ‌శేఖ‌ర్‌కి ద‌క్కేది కేవ‌లం షేర్ వ‌సూళ్లు మాత్రమే. అంటే 70 కోట్ల పెట్టుబ‌డికి 50 కోట్లు మాత్ర‌మే త‌న‌కి ద‌క్కిన‌ట్టు. అంటే బ్యాలెన్స్ 20 కోట్లు న‌ష్ట‌పోయినట్టేనా?

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపులు వ‌గైరా వ‌గైరా ఇచ్చింది కాబ‌ట్టి కొంత‌వ‌ర‌కూ న‌ష్టాన్ని అది పూడ్చి ఉంటుందని, ఓవ‌ర్సీస్ నుంచి కొంత‌మేర వ‌చ్చినా.. క‌నీసం 15 కోట్లు న‌ష్టం వ‌చ్చి ఉంటుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. దీన్నిబ‌ట్టి రుద్ర‌మ‌దేవి హిట్టా? ఫ‌్లాపా? అన్న‌దానికంటే గుణ‌శేఖ‌ర్ మెజారిటీ భాగం కోలుకున్న‌ట్టే అనుకోవ‌చ్చు. మరి నష్టపోయింది పంపిణీదారులా??