Begin typing your search above and press return to search.
నైజాం బాబులే మెయిన్ టార్గెట్
By: Tupaki Desk | 6 Sep 2015 2:06 PM GMTఈ ఏడాదిలో మోస్ట్ ప్రామిస్సింగ్ రిలీజ్ లలో రుద్రమదేవి 3డి ఒకటి. ఇండియాలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రమిది. అనుష్క టైటిల్ పాత్రలో నటించింది. ది వారియర్ క్వీన్ అనేది ఉపశీర్షిక. దర్శకనిర్మాత గుణశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తెలుగువాడి కీర్తిని దేశ విదేశాల్లో విస్తరించాలన్న సదాశయంతో గుణశేఖర్ ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందించదగ్గది.
13 శతాబ్ధం పరిపాలకుల్లో రాణీ రుద్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వీరనారి రుద్రమ కత్తి చేపట్టి శత్రవు మీదికి లంఘిస్తే శరభ శరభే. నైజాంలోని దక్కను పీఠభూమి అంతటినీ పాలించిన మహారాణిగా రుద్రమ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆదిలాబాద్ కుంతల జలపాతం (వాటర్‌ఫాల్) వద్ద గుణశేఖర్ సినిమాని ప్రారంభించారు. అక్కడే బోలెడంత షూటింగ్ కూడా చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి వచ్చేస్తోంది. అక్టోబర్ లో సినిమా రిలీజవుతోంది. 9వ తేదీనే రిలీజవుతుందని అనుకుంటున్నారు. అందుకే ఆ తొమ్మిదిరోజులు రుద్రమదేవి రథయాత్రను నైజాం ప్రాంతంలో తిప్పాలని, సినిమాకి ప్రమోషన్ చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారు.
అక్టోబర్ 1 రథం భయల్దేరనుంది. ఈ రథంపై ఓ భారీ రుద్రమదేవి కటౌట్ ని అలంకరించి, అభిమానులకు సెల్ఫీలు దిగే అవకాశం ఇస్తున్నారు. స్కూల్లో రుద్రమదేవి చరిత్ర గురించి తెలుసుకున్నాం. మన చరిత్రను మనం తెరపై చూసుకునే ఛాన్స్ అంటూ తెలంగాణలో అధికంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే రుద్రమను నైజాం బాబులు ఓన్ చేసుకుంటే.. ఇక కాసుల పండగే అని ఫీలవుతున్నాడు గుణ. చూద్దాం ఏం జరగుతుందో..