Begin typing your search above and press return to search.
శ్రీమంతుడా? శివమా? 9నే తేలేది
By: Tupaki Desk | 7 Oct 2015 3:30 AM GMTఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా డిష్కసన్‌కి వచ్చిన పాయింట్ సినిమా లెంగ్త్. పొట్టి సినిమానే గట్టిది. పొడవు సినిమా బోరింగ్ అన్న ఫీలింగ్‌తో ఆడియెన్ ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు. పొట్టి మీన్స్ రన్ టైమ్ తక్కువగా ఉంటుంది అని. పొడవు మీన్స్ రన్ టైమ్ చాలా ఎక్కువ అని. ఇటీవలి కాలంలో రిలీజైన ఓ రెండు సినిమాలు సుదీర్ఘ సమయం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. ఓవైపు సీన్లు పండలేదు. మరోవైపు నవ్వు రాలేదు. ఆడియెన్‌కి కూచున్నంతసేపూ నరకం.
ఆ రెండు సినిమాలేవో అందరికీ తెలిసినవే. ఒకటి రవితేజ కిక్ 2, రెండోది రామ్ శివమ్. వీటిల్లో ఎగ్జయిట్‌మెంట్‌తో కూర్చుని చూడటానికి ఏమీ లేదు. పైగా కామెడీ అసలే పండలేదు. ఎమోషన్ లేనేలేదు. దాంతో టిక్కెట్టు కొని థియేటర్‌కి వెళ్లిన ఆడియెన్ భారంగానే అన్నిటినీ భరించేయాల్సొచ్చింది. ఇప్పుడు ఇదే ప్రశ్న రుద్రమదేవి 3డి విషయంలోనూ తలెత్తింది. ఈ సినిమా ఏకంగా 158 నిమిషాలు. అంటే 2గంటల 38 నిమిషాలు. ఇంత సుదీర్ఘ నిడివితో సినిమా చూడాలంటే జనాలకు ఓపికలు కావాలి. ఒకవేళ అంతసేపు కదలకుండా కూచోబెట్టే దమ్ము విజువల్స్‌లో ఉంటే ఓకే. రుద్రమ చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పేయలేం. అందుకే ఇంత నిడివి అని చెప్పారు గుణశేఖర్.
శివమ్ నిడివితో పోలిస్తే శ్రీమంతుడు నిడివి కూడా సేమ్ టు సేమ్. బోర్ కొట్టింది కాబట్టి శివమ్ ఫ్లాప్. ఆకట్టుకుంది కాబట్టి శ్రీమంతుడు హిట్టు. ఇప్పుడు రుద్రమదేవి కూడా శ్రీమంతుడు లానే పెద్ద హిట్టవుతుందేమో... అక్టోబర్ 9న తేలిపోతుంది.