Begin typing your search above and press return to search.

రుహాని శర్మ.. చలిలో కూడా హీటెక్కించే అందం

By:  Tupaki Desk   |   14 Jan 2023 4:33 AM GMT
రుహాని శర్మ.. చలిలో కూడా హీటెక్కించే అందం
X
అందం, అభినయంతో ఆరంభంలోనే ప్రేక్షకులని మెప్పించిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో రుహానీ శర్మ ఒకరు. ఈ బ్యూటీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చిలాసౌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. మొదటి సినిమాలోనే స్ట్రాంగ్ క్యారెక్టర్ తో ఈ బ్యూటీ నటిగా మంచి మార్కులు వేసుకుంది. ఇందులో ఆమె డీసెంట్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది.

ఆ తరువాత హిట్ ఫ్రాంచైజ్ లో మొదటి భాగంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది. అందులో కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలోనే కనిపించి మెప్పించింది. తరువాత డర్టీ హరి అనే సినిమాలో రుహానీ శర్మ నటించింది. ఈ మూవీ సక్సెస్ కాకున్నా కూడా హీరోయిన్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. తరువాత అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాలో నటించింది.

చివరిగా మీట్ క్యూట్ అనే అంతాలజీ కథలతో వచ్చిన మూవీలో నటించింది. ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే రుహనీ శర్మ టాలీవుడ్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని కూడా ట్రెడిషనల్ లుక్స్ తో, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలే చేసింది. అయితే నటిగా ప్రూవ్ చేసుకున్న కూడా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఈ బ్యూటీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతుంది.

దీనికి కారణం ఆమెలో ఉన్న గ్లామర్ ని తెలుగు దర్శకుడు పెద్దగా చూడకపోవడమే. అయితే కమర్షియల్ హీరోయిన్స్ ని తాను ఏ మాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంటూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ అందాలతో ఫోటోలని షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి.

అందం ముందు నడుము అందాలు కనిపించే విధంగా పోజులు ఇస్తూ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలలో అమ్మడు హాట్ పోజులని సందడి చేసింది. అలాగే తనలో అందాలకి ఏ మాత్రం కొదవలేదు అనే విధంగా హాట్ హాట్ డ్రెస్సులతో ఇన్స్టాగ్రామ్ లో తన అందాల ప్రదర్శన చేస్తుంది. మరి ఈ బ్యూటీ అందాలని చూసి టాలీవుడ్ దర్శకులు మంచి గ్లామర్ రోల్ ఇస్తే ప్రూవ్ చేసుకొని కమర్షియల్ హీరోయిన్ గా మారాలనే ఈమె కోరికని నెరవేర్చుకుంటుంది అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.