Begin typing your search above and press return to search.

ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే రెచ్చిపోతున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   11 July 2021 1:30 AM GMT
ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే రెచ్చిపోతున్న బ్యూటీ
X
రుహాని శ‌ర్మ .. టాలీవుడ్ లో పాపుల‌రైన హిమ‌చ‌ల్ బ్యూటీ. కంగ‌న .. పాయ‌ల్ రాజ్ పుత్ .. పూన‌మ్ రాజ్ పుత్ త‌ర‌హాలోనే హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. బాలీవుడ్ లోనూ న‌టిస్తోంది. చండీఘ‌ర్ లో స్ట‌డీస్ పూర్తి చేసి అటుపై పంజాబీ చిత్రాల్లో న‌టించి ముంబై ప‌రిశ్ర‌మ‌లో అవకాశాల కోసం ప్ర‌య‌త్నించి చివ‌రికి తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌లో సెటిల‌వుతోంది.

చి.ల‌.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించింది. సుశాంత్ స‌ర‌స‌న నాయిక‌గా త‌న‌దైన ఆహార్యంతో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత డ‌ర్టీ హ‌రి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాతో మ‌రింత పాపులారిటీ పెంచుకుంది. అగ్ర‌నిర్మాత కం ద‌ర్శ‌కుడు ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిట్ ది ఫ‌స్ట్ కేస్ చిత్రంలోనూ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించింది. తెలుగు త‌మిళంలోనూ బిజీ నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇటీవ‌ల‌ ఇన్ స్టా వేదిక‌గా వేడెక్కించే ఫోటోల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తున్న రుహానీ త‌న అభిమానుల‌కు మరింత చేరువ‌వుతోంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోని రుహానీ షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. సింపుల్ గా టాప్ ధ‌రించి న‌డుము సొగ‌సును షోల్డ‌ర్ బ్యూటీని రుహానీ ఎలివేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఓ పెద్ద హీరో స‌ర‌స‌న న‌టించేందుకు చ‌ర్చ‌లు సాగిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంటుంది.