Begin typing your search above and press return to search.

బీచ్ వేర్ లో `చిల‌సౌ` బ్యూటీ అగ్గి రాజేస్తుందే!

By:  Tupaki Desk   |   5 April 2022 2:30 AM GMT
బీచ్ వేర్ లో `చిల‌సౌ` బ్యూటీ అగ్గి రాజేస్తుందే!
X
హిమానీ నదాలు ప్రవహించే చోట పచ్చని ప్రకృతితో ఎంతో ఆహ్లాదకరమైన సోలన్ వ్యాలీ(సిమ్లా మనాలి సమీపం) నుంచి వచ్చి చండీఘర్ లో స్టడీస్ పూర్తి చేసి అటుపై పంజాబీ చిత్రాల్లో నటించి ముంబై పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించిన బ్యూటీ రుహానీ శర్మ. `చి.ల.సౌ` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `డర్టీ హరి` లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ఆ రెండు సినిమాలు తనకు మంచి పేరు తెచ్చాయి.

`హిట్ ది ఫస్ట్ కేస్` చిత్రంలోనూ ఆసక్తికర పాత్రలో నటించింది. తెలుగు-తమిళం-మలయాళ చిత్ర సీమల్లో కెరీర్ బండిని బిజీగానే నడిపించేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం సీరియ‌స్ గానే ప్రయత్నిస్తోంది. ఇప్ప‌టికే `మీట్ క్యూట్` అనే ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఇంకా మరిన్ని అవ‌కాశాల‌తో బిజీ అవ్వాల‌ని చూస్తోంది. ఇక బాలీవుడ్ లో `అగ్ర‌` అనే సినిమాతో లాంచ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.

ఇక బ్యూటీ పాపులారిటీల సోష‌ల్ మీడియాలో అమాంతం పెరుగుతోందంటే దానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. రుహానీ సాంప్రదాయ శర్మాజీల కుటుంబం నుంచి వచ్చినా గ్లామర్ ఎలివేషన్ విషయంలో ఏమాత్రం తగ్గదు. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. తన అభిమానులకు మరింత చేరువగా వెళుతోంది రుహానీ.

తాజాగా అమ్మ‌డు బీచ్ వేర్ లో మంటలు రేపుతోన్న ఓ ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. గ్రీన్ క‌ల‌ర్ టూపీస్..బ్లాక్ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించి నేల‌పై కూర్చొని బీచ్ అందాల్ని ఆస్వాదిస్తోంది. రుహానీని బ్యాక్ యాంగిల్ నుంచి కెమెరా క్యాప్చ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఒక్క పెద్ద ఛాన్స్ తో మనాలి బ్యూటీ కెరీర్ కంగనలా దశ తిరిగిపోతుందేమో చూడాలి.