Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా చిలసౌను పట్టించుకుంటారా?

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:30 PM GMT
ఇప్పుడైనా చిలసౌను పట్టించుకుంటారా?
X
'చి.ల.సౌ' వంటి హిట్‌ మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు దక్కించుకున్నా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈమె తదుపరి చిత్రం కోసం చాలా కాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మొదటి సినిమాలో హోమ్లీగా కనిపించిన రుహానీ శర్మ సోషల్‌ మీడియాలో మాత్రం తన హాట్‌ ఫొటో షూట్స్‌ తో తనలోని కొత్త యాంగిల్స్‌ ను చూపించింది.

సోషల్‌ మీడియాలో బికినీ ఫొటో షూట్స్‌ తో పాటు హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడు త్వరలో 'హిట్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ తో కలిసి ఈ అమ్మడు నటించింది. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ లో లిప్‌ లాక్‌ సీన్‌ తో ఈ జంట రెచ్చి పోయింది. వీరిద్దరి జోడీకి జనాలు ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా ఈ లిప్‌ లాక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. టాలీవుడ్‌ లో ఇప్పటి వరకు చాలా లిప్‌ లాక్‌ సీన్స్‌ చూశాం. కాని ఇది అంతకు మించి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొదటి సినిమాతో హోమ్లీ హీరోయిన్‌ అంటూ పేరు తెచ్చుకున్న కారణంగా ఈమెకు నిర్మాతలు ఆఫర్లు ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. మరి హిట్‌ చిత్రంతో అయినా ఈమెపై ఉన్న అభిప్రాయం మారి అవకాశాలు వస్తాయేమో చూడాలి.