Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్లాక్ డ్రెస్ లో సైడ్ వ్యూ

By:  Tupaki Desk   |   1 July 2019 9:07 AM GMT
ఫోటో స్టొరీ: బ్లాక్ డ్రెస్ లో సైడ్ వ్యూ
X
టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల హంగామా కాస్త ఎక్కువే. ప్రతి నెలలో ఒక కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అవుతూ ఉంటుంది. అయితే వీరందరిలో ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అయ్యేవారిని.. హీరోయిన్ గా కెరీర్ ను విజయవంతంగా కొనసాగించేవారిని మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. కొందరికి మొదటి సినిమాతో కాస్త మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ తర్వాత అవకాశాల కోసం చాలాకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంజాబీ బ్యూటీ రుహాని శర్మ పరిస్థితి అలానే ఉంది.

సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో హీరోయిన్ గా రుహాని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'చిలసౌ' లో రుహాని పోషించినది సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర.. గర్ల్ నెక్స్ట్ డోర్ టైపు. దీంతో 'చిలసౌ' కు మంచి పేరు వచ్చినా.. రుహానీ కెరీర్ కహానీ ఏమీ మారలేదు. కొత్త అవకాశాలు రాలేదు. దీంతో తన లోపలినుంచి హాట్ బ్యూటీని బైటకు తీసి ఫోటో షూట్లలో పాల్గొంటోంది. ఆ హాటు ట్రెండ్ కంటిన్యూ చేస్తూ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రుహాని బ్లాక్ కలర్ ఇన్నర్ ధరించింది.. స్టైల్ గా స్కార్ఫ్ ను మెడకు చుట్టుకుంది. జుట్టుకు కొప్పు కట్టింది. ఐ మేకప్ చేయడంతో వెరైటీగా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలో హైలైట్ మాత్రం సైడ్ నుంచి కనిపిస్తున్న అందాలే.

ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "యు ఆర్ సో హాట్".. "స్టన్నింగ్ అండ్ ప్రెట్టి వుమన్".. "అల్టిమేట్ లుక్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం "ఏంటి ఈ డ్రెస్సు" అంటూ చిరాకు పడ్డారు. అయితే రుహానికి స్పందన కావాల్సింది నెటిజనుల నుంచి మాత్రమే కాదు.. ఫిలిం మేకర్ల నుండి. ఈ గ్లామర్ గేర్లు.. హాట్ యూ టర్నులు ఆ రెస్పాన్స్ కోసమే.