Begin typing your search above and press return to search.
బోయపాటి సినిమాకు రూలర్ గుదిబండ?
By: Tupaki Desk | 21 Dec 2019 10:18 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంత తక్కువ అంచనాలతో సినిమాను ప్రేక్షకులు చూసినప్పటికీ ఆ అంచనాలు కూడా అందుకోలేకపోయింది. సినిమాకు బ్యాడ్ టాక్.. బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడడం అసాధ్యమేనని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రభావం బోయపాటితో చేస్తున్న బాలయ్య తదుపరి చిత్రంపై పడడం ఖాయమని వారు అంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ దారుణ ఫలితంతో బాలయ్య కొత్త సినిమా 'రూలర్' కు క్రేజ్ తగ్గింది. పైగా 'రూలర్' ప్రోమోస్ లో ఎక్కడా కొత్తదనం అన్నది లేకపోవడంతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లుపెట్టుబడి పెట్టేందుకు రెడీ కాలేదు. దీనివల్ల 'రూలర్' దాదాపు రూ.15 కోట్ల డెఫిసిట్ తో రిలీజ్ అయింది. అంత లోటుతో విడుదల అయినా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువేననే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూటర్లలో చాలామంది 'మహానాయకుడు' వల్ల దెబ్బ తిన్నవారే. అమెరికా డిస్ట్రిబ్యూటర్ విషయమే తీసుకుంటే ఆయన కూడా 'మహనాయకుడు' వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారట. 'రూలర్' తో ఆయనకు మరింతగా దెబ్బతగిలేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆయన 'రూలర్' ప్రమోషన్స్ కోసం ఆయన అప్పులు తీసుకొచ్ఛి మరీ ఖర్చు పెట్టారని అంటున్నారు.
'రూలర్' డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇలా ఉండడం బోయపాటి నెక్స్ట్ సినిమాపైన పడుతుందని అంటున్నారు. బోయపాటి సినిమాను ఈ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుందని.. ఇది బోయపాటి సినిమాకు గుదిబండగా మారే అవకాశం తోసిపుచ్చలేమనే వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా బాలయ్య క్రేజ్ తగ్గిన సంకేతాలు కనిపిస్తుండడం కూడా బోయపాటి సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అసలే 'వినయ విధేయ రామ' డిజాస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి బాలయ్య సినిమా బోయపాటికి ఓ పెద్ద ఛాలెంజ్ కాబోతోందని అంటున్నారు.