Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'రూలర్'
By: Tupaki Desk | 20 Dec 2019 3:54 PM GMTచిత్రం : 'రూలర్'
నటీనటులు: నందమూరి బాలకృష్ణ - సోనాలి చౌహాన్ - వేదిక - భూమిక - ప్రకాష్ రాజ్ - నాగినీడు - రఘుబాబు - శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: చిరంతన్ భట్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
కథ - మాటలు: పరుచూరి మురళి
నిర్మాత: సి.కళ్యాణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
ఇంతకుముందు ‘జై సింహా’ అందించిన నందమూరి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ కలయికలో తెరకెక్కిన కొత్త సినిమా ‘రూలర్’. దీని టీజర్, ట్రైలర్ చూస్తే.. బాలయ్య ఎన్నోసార్లు ట్రై చేసిన మాస్ మసాలా సినిమాలాగే కనిపించింది. పెద్దగా అంచనాల్లేకుండా ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమాగా ఇది ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ:
రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడి ఉన్న ఓ వ్యక్తిని తీసుకొచ్చి చికిత్స చేయించి దత్తత తీసుకుని.. అతడికి అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) అని పేరు పెట్టి తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిని చేస్తుంది సరోజినీ దేవి (జయసుధ). అర్జున్ కు తన గతమేంటో తెలియదు. సరోజినీనే తన తల్లిగా భావించి.. ఆమె వ్యాపారాల్ని నడిపించే బాధ్యత తీసుకుంటాడు. ఓ అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధమైన అర్జున్.. యూపీలో తన తల్లి పెట్టాలనుకున్న సోలార్ ప్లాంటు శంకు స్థాపన కోసం వెళ్తాడు. అక్కడ ఆ ప్లాంటుకు అడ్డు పడిన వాళ్లను చితకబాదుతాడు. అప్పుడక్కడ అర్జున్ ను చూసిన ఆ ఊరి జనాలు తాము దైవంగా కొలిచే ధర్మ వచ్చాడని సంబరపడతారు. ఇంతకీ ఈ ధర్మ ఎవరు.. అతనే ఈ అర్జునా.. అతడి గతమేంటి.. అన్నది తెర మీదే చూసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
‘రూలర్’ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్యకు, సోనాల్ చౌహాన్ కు మధ్య ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. ఆ సీన్ చూస్తే ఇక వీళ్లిద్దరి మధ్య పాటే తరువాయి అనిపిస్తుంది. దానికి మానసికంగా సిద్ధమైపోగానే.. పాట తాలూకు మ్యూజిక్ కూడా మొదలైపోతుంది. కానీ అప్పటిదాకా టోనీ స్టార్క్ ను పోలిన గెటప్ లో ఉన్న బాలయ్య ఉన్నట్లుండి అవతారం మార్చి జులపాల జుట్టుతో కనిపిస్తాడు. బాలయ్య పక్కనేమో సోనాల్ కాకుండా వేదిక కనిపిస్తుంది. వాళ్లు రొమాంటిక్ మూడ్లోకి వెళ్తే.. కొత్తగా వీళ్లు పాట అందుకున్నారేంటి అని అయోమయంలో ఉండగా.. పాట ఆగిపోతుంది. కొన్ని మాంటేజ్ షాట్లు కనిపిస్తాయి. తర్వాత ఏడుపు ముఖంతో ఉన్న వేదిక కనిపిస్తుంది. ఈమె భర్త అయిన ఇంకో బాలయ్యను తలుచుకునే క్రమంలో ఆ పాట.. ఆ షాట్లు వస్తాయన్నమాట. తీవ్రమైన దు:ఖంలో ఉన్న ఆమె భర్తను తలుచుకుంటే వాళ్లిద్దరి మధ్య జరిగిన సంఘటనలేవైనా గుర్తు రావడం మామూలే కానీ.. వాళ్లు వేసుకున్న డ్యూయెట్.. అందులో చేసిన రొమాన్స్ సైతం గుర్తు రావడం విడ్డూరం. ‘రూలర్’ సినిమా ఎంత ముతకగా ఉంటుంది.. సన్నివేశాలకు సన్నివేశాలకు మధ్య పొంతన లేకుండా ఎంత అర్థరహితంగా సాగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి చిత్రాలు సినిమాలో బోలెడన్నది కనిపిస్తాయి.
మన తెలుగు హీరోల్ని వీరాధి వీరులుగా.. యోధానుయోధులుగా చూపించడం కోసం మన రచయితలు భలే కథలు వండుతుంటారు కొన్నిసార్లు. వాళ్లను లోకల్ కింగులుగా చూపిస్తే కిక్కు రాదని.. సెటప్ అంతా తీసుకెళ్లి ఏ నార్త్ ఇండియాలో కరడుగట్టిన గూండాలు, రౌడీలు ఉన్న చోట పెట్టేస్తుంటారు. అక్కడ తెలుగోళ్లపై అరాచకాలు మామూలుగా ఉండవు. వాళ్ల ధాటికి జనాలు అల్లాడిపోతుంటే.. ‘‘మనల్ని కాపాడటానికి ఎవరూ రారా’’ అంటూ ఒక నిట్టూర్పు. ‘‘వస్తాడు ఒకడొస్తాడు’’ అంటూ ఆశావాదం. అప్పుడే రంగంలోకి దిగుతాడు హీరో. ఇక విలన్ల ఖేల్ ఖతం. దశాబ్దం కిందంటే అరిగిపోయిన ఫార్ములా ఇది. ఇలాంటి కథను ఇంకా పాత స్టయిల్లో నరేట్ చేసి మనల్ని కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తాడు కె.ఎస్.రవికుమార్. ఈ దర్శకుడు ఔట్ డేట్ అయిపోయాడని తమిళ హీరోలే దండం పెట్టేస్తే మన బాలయ్య మాత్రం ఆయన్ని నమ్మి ఒకటికి రెండు సినిమాలు చేశాడు. ‘జై సింహా’కు ఏదో కాలం కలిసొచ్చి ఓ మోస్తరుగా ఆడేసేసరికి ఇంకా ముతక కథను ఎంచుకుని తెర మీద మీద బీభత్సం సృష్టించాడు రవికుమార్.
ఇందులో హీరో యూపీలో ఒక ఎస్ఐ. ప్రత్యర్థులు చేసిన దాడిలో అతడి ప్రాణాల మీదికి వస్తుంది. మతిస్థిమితం కోల్పోతాడు. అతడికి వైద్యం చేయించి తన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేస్తుంది ఒక మహానుభావురాలు. ఐతే తన గతం మరిచిపోయిన వ్యక్తి నువ్వు నా కొడుకువి అంటే నమ్మేయడం వరకు ఓకే. కానీ దేశ విదేశాలు తిరుగుతూ.. ఒక మల్టీ నేషనల్ కంపెనీని విజయవంతంగా నడిపించడం.. నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడం.. చిన్నప్పట్నుంచి ఇదే నా జీవితం అన్నట్లుగా వ్యవహరించడం విడ్డూరం. తెలుగు ప్రేక్షకుల తెలివి తేటల మీద ‘రూలర్’ రచయిత.. దర్శకులకు ఎంత చిన్న చూపో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎంత మాస్ సినిమా అయినా మరీ ఇంత లాజిక్ లెస్ గా హీరో పాత్రను.. కథను తీర్చిదిద్దడమేంటో?
ఒకప్పుడు పరుచూరి సోదరులకు బాలయ్యను చూస్తే కలం ఆగేది కాదు. అవసరమున్నా లేకున్నా పేజీలకు పేజీలు డైలాగులు రాసేసేవాళ్లు. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా చూసిన ఒక ప్రేక్షకుడు.. ఏంటి సార్ మూడు సినిమాలకు సరిపడా డైలాగులు రాశారు అని తమను ప్రశ్నించినట్లు గోపాలకృష్ణ ఓ సందర్భంలో చెప్పుకున్నారు. ‘రూలర్’లో మరీ ఆ స్థాయిలో కాదు కానీ.. రెండు సినిమాలకు సరిపడా డైలాగులైతే బాలయ్య లాగించేశాడు. సమయం సందర్భం చూడకుండా కొన్ని సన్నివేశాల్లో ఆయన ప్రసంగాల తరహాలో దంచిన డైలాగులకు చెవుల తుప్పు వదిలిపోతుంది. ప్రథమార్ధంలో థాయిలాండ్ నేపథ్యంలో సాగే రొమాంటిక్.. కామెడీ ట్రాక్స్ ముందు చెత్తగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ చూశాక అవి చాలా బాగున్నాయనే ఫీలింగ్ రావడం ‘రూలర్’లోని ప్రత్యేకత. టీజర్, ట్రైలర్ చూసి ఎంత తక్కువ అంచనాలతో వెళ్లినా కూడా.. ‘రూలర్’ను భరించడం కష్టమవుతుందంటే ఇందులో సన్నివేశాలు ఎలా సాగుతాయో ఒక అంచనాకు రావచ్చు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు.. పాటల్లో బాలయ్య డ్యాన్సులు మినహాయిస్తే.. నందమూరి అభిమానులు సైతం ‘రూలర్’ను భరించడం కష్టమే.
నటీనటులు:
బాలకృష్ణ ఆ టోనీ స్టార్క్ గెటప్ లో ఉన్నంత వరకు అభిమానుల్ని అలరించాడు. యాక్షన్ పరంగా.. డైలాగులు పేల్చడంలో ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. జులపాల జుట్టుతో విచిత్రమైన విగ్గుతో బాలయ్య కనిపించిన సన్నివేశాలు చూస్తున్నపుడు.. ఎంత త్వరగా స్క్రీన్ మీది నుంచి బాలయ్య పక్కకు వెళ్తే అంత బాగుంటుందనిపిస్తుంది. ఈ గెటప్ ను దర్శకుడు ఎలా ఓకే చేశాడో ఏమిటో. విలన్ పాత్రధారి గురించి చెప్పడానికేమీ లేదు. ప్రకాష్ రాజ్, భూమిక పెర్ఫామెన్స్ పరంగా కొంత స్కోర్ చేశారు. వేదిక.. సోనాలి చౌహాన్ పోటీ పడి అందాలు ఆరబోసే ప్రయత్నం చేశారు. వేదిక అయితే ఒక సీన్లో వల్గర్ పోజులిచ్చింది. జయసుధ పాత్రలో ఏ విశేషం లేదు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
చిరంతన్ భట్ చాలా మొక్కుబడిగా మ్యూజిక్ చేశాడన్నది ఆడియో విన్నపుడే అర్థమైపోయింది. పాటల్లో ఏదీ గుర్తుంచుకోదగ్గది లేదు. ఈ సినిమాకు ఇంతకంటే అవసరం లేదు అన్నట్లుగా అతను పాటలు లాగించేసినట్లనిపిస్తుంది. నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం ప్రేక్షకుల్ని 90ల్లోకి తీసుకెళ్తుంది. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. దర్శకుడిగా అవకాశాలు లేని పరుచూరి మురళి అందించిన కథ పూర్తిగా ఔట్ డేట్ అయిపోయింది. మాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక రవికుమార్ దర్శకత్వ పనితనం గురించి ఏం చెప్పాలి? తమిళంలో ఆయన చివరగా తీసిన ‘లింగ’ సైతం ఎన్నో రెట్లు మేలనిపించేలా ‘రూలర్’ను ముతక స్టయిల్లో తీశాడు. ఫలానా సీన్ అని కాదు కానీ.. మొత్తంగా సినిమా అంతటా రవికుమార్ పనైపోయిందనే సంకేతాలు కనిపిస్తూనే ఉంటాయి.
చివరగా: రూలర్.. బాబోయ్ బాలయ్యా!
రేటింగ్-1.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre