Begin typing your search above and press return to search.
'రూలర్'కు గుమ్మడికాయ కొట్టేశారట
By: Tupaki Desk | 28 Nov 2019 11:00 AM GMTనందమూరి బాలకృష్ణ 105వ చిత్రం 'రూలర్' వచ్చే నెల 20న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కె యస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు. బాలయ్య విభిన్నమైన మేకోవర్ తో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్ మరియు వేదికలు హీరోయిన్స్ గా నటించారు.
ఈ ఏడాది బాలయ్య ఇప్పటికే 'ఎన్టీఆర్ కథానాయకుడు' మరియు 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. బాలయ్యకు నిర్మాతగా కూడా ఆ సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చాయి. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను బాలయ్య చేశాడు. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో జైసింహా చేసిన బాలయ్య ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మరో సారి ఛాన్స్ ఇచ్చాడు.
ఈసారి కథ విషయంలో బాలకృష్ణ చాలా నమ్మకంగా ఉన్నాడట. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపించబోతున్నాడు. లుక్ విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నా కూడా ఓవరాల్ గా సినిమాపై నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. జెట్ స్పీడ్ తో తెరకెక్కిన ఈ చిత్రం అదే స్పీడ్ తో ప్రేక్షకుల్లో కి దూసుకు పోతుందా లేదంటే అంతే స్పీడ్ తో థియేటర్లకు వెళ్లి వచ్చేస్తుందా అనేది చూడాలంటే డిసెంబర్ 20వ తారీకు వరకు వెయిట్ చేయాల్సిందే.