Begin typing your search above and press return to search.
మల్టీప్లెక్సుల్లోకి మన ఫుడ్ తీసుకెళ్లొచ్చు.. కానీ!!
By: Tupaki Desk | 14 Dec 2019 4:58 AM GMTమల్టీప్లెక్స్ కల్చర్ సగటు మనిషి జేబు గుల్ల చేస్తున్న సంగతి తెలిసిందే. వినోదం.. ఫుడ్.. షాపింగ్ అన్నీ ఒకే చోట అంటూ పెద్ద మొత్తంలో పన్ను బాదుడును భరించక తప్పడం లేదు. ఇదంతా సరే కానీ.. మల్టీప్టెక్స్ థియేటర్లలో తిండి దోపిడీ మరీ అతిగా మారిందన్న విమర్శలు రెగ్యులర్ గా వినాల్సి వస్తోంది. రూల్స్ ఒకలా ఉంటే వసూళ్ల దందా ఇంకోలా ఉందని.. అది కాస్తా అతి అయ్యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వినోదం కోసం.. సినిమా వ్యామోహంతో మల్టీప్లెక్స్ కి వచ్చే సగటు ప్రేక్షకుడిని అధిక ధరలతో జేబులు గుల్ల చేయడం సర్వ సాధారణమైపోయింది. అభిమాన హీరో సినిమా కదా! అని టిక్కెట్ రేటుకు మించి ఖర్చు చేయడం వరకూ ఓకే కానీ... థియేటర్లలోకి వెళ్లాక విశ్రాంతి వేళ పేలిపోయే బిల్లు గురించే అందరిలో బయటపడని బెంగ. ఇంటర్వెల్ లో స్నాక్స్.. కూల్ డ్రింక్స్.. వాటర్ బాటిల్స్ కొనాలని చూసినప్పుడు మాత్రం టిక్కెట్టు బుక్ చేసినప్పటి హుషారంతా ఆవిరైపోతోంది.
కారణం బయటి లభించే రేట్లకు పది రెట్లు అధికంగా థియేటర్ లో ధరలు పెంచి అమ్ముతుండడమే ఇందుకు కారణం. నగర పాలక సంస్థ రూల్స్ ఒకలా ఉంటే.. ఇక్కడ ధరల జాబితా ఇంకోలా ఉంటోంది. అధికారులు ఎన్ని సార్లు ధరలపై సోదాలు నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం వుండటం లేదు. అయితే ఇక నుంచి థియేటర్లలో అధిక రేట్లకు అమ్మేవారి పప్పులు ఉడకవు అని చెబుతున్నారు. థియేటర్లకు సినిమా కోసం వెళ్లే వాళ్లు ఇక నుంచి వారికి కావాల్సిన ఆహార పదర్థాల్ని యథేచ్ఛగా ఇంటి నుంచి తీసుకెళ్లొచ్చు అని ఇంతకుముందే కోర్టు తీర్పు వెలువరించింది. ఇటీవల అవినీతి నిరోధక కార్యకర్త విజయ్ గోయల్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా నగర పోలీసులు ఇక నుంచి థియేటర్లకు వెళ్లే వారు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకెళ్లొచ్చని.. ఇందుకు థియేటర్ సిబ్బంది ఎలాంటి అడ్డు చెప్పకూడదని తేల్చి చెప్పారు.
అయితే ఈ చట్టం కొత్తగా చేశారా? అంటే ఇది ఎప్పటిదో. 1955లోనే వినియోగాదారుల సౌకర్యార్థం ఎలాంటి తినుబండారాలైనా థియేటర్లలోకి తీసుకెళ్లొచ్చని అందులో పొందుపరిచారు. అయితే ఎందుకు ఇన్నేళ్లుగా అమలు కావడంలేదంటే థియేటర్లలో క్యాంటీన్లు.. ఫుడ్ బేవరేజెస్ కాంట్రాక్టులు బడా నాయకులవి.. లేదా వారి బంధువులవి కావడమే ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారింది. మరో కారణం ఏంటంటే థియేటర్ల సేఫ్టి కారణంగానే ప్రేక్షకుల్ని థియేటర్లలోకి స్నాక్స్ ని తీసుకురానివ్వడంలేదని గత కొన్నేళ్లుగా థియేటర్ల యాజయాన్యం కుంటి సాకులు చెబుతూ వస్తోంది. ఈ పద్దతి ఇక నుంచైనా మారుతుందేమో చూడాలి.