Begin typing your search above and press return to search.

ఆమె పెళ్లి వార్తలు మళ్లీ పుకార్లే

By:  Tupaki Desk   |   6 Jun 2021 8:30 AM GMT
ఆమె పెళ్లి వార్తలు మళ్లీ పుకార్లే
X
తెలుగు అమ్మాయి అంజలి ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె అనేక సార్లు పెళ్లి వార్తలతో మీడియాలో నిలిచింది. తమిళ యంగ్‌ హీరో జై తో అంజలి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. దాదాపు రెండేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. ఆ సమయంలో వారి పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఒకటి రెండు నెలల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో వారు బ్రేకప్‌ అయ్యారు. వారి బ్రేకప్ కు కారణం ఏంటీ అనే విషయం లో క్లారిటీ లేదు. ఆ తర్వాత మళ్లీ అంజలి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పలు సార్లు ఆ వార్తలను అంజలి కొట్టి పారేసింది.

ఇటీవల అంజలి మరోసారి పెళ్లికి సిద్దం అయ్యింది అంటూ ప్రచారం మొదలు అయ్యింది. కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఇటీవల ఆమె సన్నిహితులు తమిళ మీడియా తో మాట్లాడుతూ పెళ్లి గురించి వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకునే మూడ్‌ లో లేదని క్లారిటీ ఇచ్చేశాడు. కెరీర్‌ పైనే దృష్టి పెట్టిన ఆమె పెళ్లి గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని పేర్కొన్నాడు. మీడియాలో ఆమె గురించి రెగ్యులర్ గా వస్తున్న పుకార్లకు వారి వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినట్లయింది.

ఇటీవల వకీల్ సాబ్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అంజలి తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో మాత్రం కమర్షియల్‌ హీరోయిన్ గా ఆఫర్లు దక్కడం లేదు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచి కథల కోసం ఎదురు చూస్తున్నాను.. తప్పకుండా తెలుగు మరియు తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. కొత్త వారు వచ్చిన వెంటనే పాత హీరోయిన్‌ లకు ఆఫర్లు తగ్గుతాయనే వాదనను కూడా అంజలి ఆ సందర్బంగా కొట్టి పారేసింది.