Begin typing your search above and press return to search.

అప్పుడే మహేష్ 27 అంటూ మొదలెట్టేశారు

By:  Tupaki Desk   |   8 March 2019 10:48 AM GMT
అప్పుడే మహేష్ 27 అంటూ మొదలెట్టేశారు
X
మహర్షి విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. దాని ప్రమోషన్ సంగతి ఏమో కానీ ఇప్పుడు దీని తర్వాత రాబోయే సినిమాల గురించి చిత్ర విచిత్రమైన వార్తలు కథనాలు వచ్చేస్తున్నాయి. అనిల్ రావిపూడితో తన 26వ సినిమా ఓకే చేసిన మాట నిజమే కాని ఫుల్ స్క్రిప్ట్ తో అతను మెప్పించాక స్వయంగా మహేష్ ప్రకటిస్తే తప్ప ఇది కూడా పక్కా అనుకోవడానికి లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ 27ని తెరమీదకు తెచ్చేశారు. మనవాళ్ళు ఖాళీగా లేరు కాబట్టి ఈసారి పక్క రాష్ట్రం దర్శకుడిని పట్టుకొచ్చారు.

కెజిఎఫ్ తో దేశవ్యాప్త సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబుకి లింక్ పెట్టేశారు. ఇటీవలే ఓ కథ చెప్పాడని నమ్రత మహేష్ లకు భలే నచ్చిందని వచ్చే ఏడాది కెజిఎఫ్ 2 రిలీజ్ కాగానే ఇది స్టార్ట్ చేద్దామని చెప్పినట్టు ఇలా వండి వార్చేశారు. నిజానికి కెజిఎఫ్ 2కే సంబంధించిన కాస్టింగ్ పనులే ఇంకా చాలా బాలన్స్ ఉన్నాయి. దానికి తోడు స్క్రిప్ట్ లో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది.

ఎంతైనా పెట్టేందుకు బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలు పచ్చ జెండా ఊపేశారు. ఇవన్ని బాలన్స్ చేసేందుకే ప్రశాంత్ నీల్ వద్ద టైం లేదు. అలాంటిది అవన్నీ పక్కన పెట్టి మహేష్ కు లైన్ చెప్పడం వెంటనే ఒప్పేసుకోవడం ఏకంగా షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇదంతా టైం పాస్ గాలి వార్తగా మహేష్ క్యాంప్ కొట్టిపారేస్తోందట. అదేదో సామెత చెప్పినట్టు ఆలు లేదు చూలు లేదు కూతురు పేరు అరుంధతి అని అలా ఉంటున్నాయి మహేష్ సినిమాల గాసిప్ న్యూస్. ఇంకొంత వెయిట్ చేస్తే మహేష్ 27 న్యూస్ కూడా పుట్టిస్తారేమో