Begin typing your search above and press return to search.
పాపం షకీలాను చంపింది ఎవరు?
By: Tupaki Desk | 31 July 2021 11:42 AM GMTసోషల్ మీడియా విస్తృతమైన తర్వాత సమాచారం శరవేగంగా జనాలకు చేరిపోతోంది. అయితే.. ఇందులో గుడ్ న్యూస్ తోపాటు.. బ్యాడ్ న్యూస్ ను సృష్టించడం.. సర్క్యులేట్ చేయడం కూడా పెరుగుతోంది. సెలబ్రిటీలు చనిపోయారంటూ కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య మిస్టర్ బీన్ చనిపోయారని పోస్టులు చేశారు. ఆ తర్వాత లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా చనిపోయారని ప్రచారం చేశారు. తాజాగా.. ప్రముఖ శృంగార తార షకీలా కూడా చనిపోయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అయ్యాయి.
వీటి తీవ్రత ఎక్కువకావడంతో.. ఈ విషయం షకీలా వరకు వెళ్లింది. బంధు మిత్రులు షకీలా మొబైల్ నంబర్ కు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారట. దీంతో.. క్లారిటీ ఇచ్చేందుకు షకీలా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఓ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చనిపోయానని ఎవరో ప్రచారం చేశారని, దీనివల్ల తనవాళ్లంతా భయపడిపోయారని, వందలకొద్దీ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఇప్పుడు మీతో మాట్లాడుతుండడమే అందుకు నిదర్శనమని అన్నారు. అయితే.. ఈ పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని కూడా అన్నారు. దీనివల్ల తనను అభిమానులు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలిసిందని, మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఇచ్చినందుకు ఆ వ్యక్తికి థాంక్స్ చెబుతున్నానని చెప్పారు.
‘‘నేను ఈ మధ్య ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను. నేను చనిపోయానని ఎవరో ప్రచారం చేశారు. దీంతో.. వందలాది ఫోన్ కాల్స్ వచ్చాయి. నిజానికి నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. నేను చాలా హ్యాపీగా, హెల్డీగా ఉన్నాను. అందుకే.. ఈ వీడియోనే నిదర్శనం. ఇలాంటి గాసిప్స్ ను నమ్మకండి. అయితే.. ఒక విధంగా ఈ సాడ్ న్యూస్ సృష్టించిన వ్యక్తికి నేను థాంక్స్ చెబుతున్నాను. దానివల్ల మిమ్మల్ని ఇలా కలుసుకునే అవకాశం వచ్చింది.’’ అని అన్నారు షకీలా.