Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' 20 వేలు నిజం కాకపోవచ్చు
By: Tupaki Desk | 19 Jan 2022 5:35 AM GMTప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మోషన్ గ్రాఫిక్స్ మూవీ 'ఆదిపురుష్' ఈ ఏడాది ఆగస్టులో విడుదల అవ్వడం పక్కా అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ముగించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. పలు దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామాయణ ఇతివృతం తో రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.. సీత దేవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా ను ఇండియన్ భాషలు అన్నింటిలో కూడా డబ్ చేస్తారని అంటున్నారు. హిందీ లో రూపొందుతున్న ఈ సినిమా ను ఇంగ్లీష్ లో కూడా డబ్ చేయబోతున్నారు. చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటీ అంటే... ఈ సినిమా ను ఏకంగా 20 వేల థియేటర్లలో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకోసం ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి ఇరవై వేలకు ఒక్క థియేటర్ కూడా తగ్గకుండా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కాని ఈ సినిమా 20 వేల థియేటర్లలో విడుదల నిజం కాదట.
హాలీవుడ్ సినిమాలు కూడా ఆ స్థాయిలో విడుదల అవ్వడం సాధ్యం కాదు. చైనాలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసినా కూడా అది సాధ్యం కాకపోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లు మాత్రమే అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైనే శ్రద్ద పెట్టినట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ను ఇంగ్లీష్ లో డబ్ చేసే ఉద్దేశ్యం అయితే ఉంది కాని అది థియేటర్ల ద్వారా విడుదల చేస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఆదిపురుష్ సినిమా 20 వేల థియేటర్ల రిలీజ్ నిజం కాదట ఒక స్పష్టత వచ్చింది.