Begin typing your search above and press return to search.
ఆ రెండు సినిమాల తరహాలోనే అఖిల్?
By: Tupaki Desk | 23 Sep 2015 4:42 AM GMTఅక్కినేని అఖిల్ నటిస్తున్న 'అఖిల్' చిత్రం విడుదలకు దగ్గరపడడంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దర్శకత్వ శాఖ, నిర్మాణ సంస్థ, హీరోని పరిచయం చేస్తున్న ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అక్టోబర్ లో విడుదల ముహూర్తం ఖరారు చేశారు.
ఇటీవల ఆడియో వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ లో కనిపించిన కధాంశం ఈ మధ్య కాలంలో విడుదలైన రెండు ఫ్లాప్ సినిమాల స్టోరీ లైన్ ని తలపిస్తుంది. కష్టాలలో వున్న గ్రామ ప్రజలను కాపాడడానికి వాళ్ళందరి దేవుడిగా ఆవిర్భవించే దేవుడి రూపమే హీరో పాత్ర. ఈ విధమైన కాన్సెప్ట్ తోనే మహేష్ బాబు ఖలేజా, రవితేజ కిక్ 2 తెరకెక్కాయి. ఆ చిత్రాలలో సైతం కష్టాలలో వున్న గ్రామప్రజలు హీరోని దేవుడిగా కీర్తించడం చూశాం.
అఖిల్ ట్రైలర్ లో సైతం ఆఫ్రికన్ తెగకు చెందిన ఒక ఊరి ప్రజల దేవుడిగా అఖిల్ కనిపించే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా 'పవర్ ఆఫ్ జువా' మన ఊహకు ఆజ్యం పోస్తుంది. జువా అంటే సూర్యుడు. ఆటవీకులకు సూర్యుడే దేవుడు. ఆ సూర్యుడి అంశంగా మన హీరో వారిని కాపాడే పనిలో వుంటాడని భావన..